టీఆర్‌ఎస్‌తో బీజేపీకి రాజీ కుదిరిందనే ప్రచారంపై స్పందించిన కిషన్‌రెడ్డి

తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటన రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. జీహెచ్ఎంసీ ఎన్నికలకు ముందు.. తర్వాత పరిణామాలపై ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఎన్నికలకు ముందు బీజేపీపై నిప్పులు చెరిగిన కేసీఆర్.. తాజాగా ఢిల్లీకి వెళ్లి ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా, ఇతర కేంద్ర మంత్రులను కలవడం చర్చనీయాంశంగా మారింది. పైకి వరద సాయం కోసం కలిశానని.. తెలంగాణ ప్రయోజనాల కోసం కలిశానని కేసీఆర్ చెబుతున్నారని.. కానీ లోగుట్టు వేరే ఉందని బహిరంగ విమర్శలు వినిపిస్తున్నాయి.

టీఆర్‌ఎస్‌తో బీజేపీకి రాజీ కుదిరిందంటూ ప్రచారం సైతం తెలంగాణలో జోరుగా సాగుతోంది. దీనిపై తాజాగా కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి స్పందించారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం రాబోతోందన్నారు. టీఆర్‌ఎస్‌తో బీజేపీకి రాజీ కుదిరిందనే ప్రచారాన్ని ఖండిస్తున్నామన్నారు. ప్రధాని మోదీ, అమిత్‌షాతో కేసీఆర్‌ ఏం మాట్లాడారో ఆయన్నే అడగాలని తెలిపారు.టీఆర్‌ఎస్‌ చేసింది రైతుల బంద్‌ కాదని.. సర్కారీ బంద్ అని కిషన్‌రెడ్డి ఎద్దేవా చేశారు. రత్‌ బంద్‌లో మంత్రులు పాల్గొనడం సిగ్గుచేటన్నారు.

భాబంద్‌లో పాల్గొన్న కేటీఆర్‌, కవితలను ఎందుకు అరెస్ట్‌ చేయలేదని కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. బీజేపీ నిరసనలకు సైతం పోలీసులు సహకరించాలన్నారు. మోదీని ఎదుర్కోలేక వ్యవసాయ చట్టాలపై రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. రైతులకు నష్టం చేకూర్చే ఏ నిర్ణయాన్నీ కేంద్రం తీసుకోదన్నారు. వ్యవసాయ చట్టాలపై ప్రధాని మోదీకి స్పష్టమైన వైఖరి ఉందన్నారు. రైతులు ధైర్యంగా సాగు చేయాలనే లక్ష్యంతోనే... కేంద్రం నూతన సాగు చట్టాలను తీసుకొచ్చిందని వెల్లడించారు. తెలుగు రాష్ట్రాల రైతులకు యూరియా అందుబాటులోకి రాబోతుందని కిషన్‌రెడ్డి తెలిపారు.

More News

'డర్టీ హరి' నిర్మాతపై కేసు నమోదు

క్లాసిక్‌ హిట్స్ లాంటి ఎన్నో అద్భుతమైన చిత్రాలను తెరకెక్కించిన నిర్మాత ఎంఎస్‌ రాజు, లాంగ్ గ్యాప్ తరువాత యూత్‌ను టార్గెట్ చేస్తూ ఓ బోల్డ్ అడల్ట్ కంటెంట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

బండారు దత్తాత్రేయకు త్రుటిలో తప్పిన పెను ప్రమాదం

హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయకు  పెను ప్రమాదం త్రుటిలో తప్పింది.

రానా బర్త్‌డే స్పెషల్.. ‘విరాటపర్వం’ ఫస్ట్‌లుక్ వచ్చేసింది..

కెరీర్ ఆరంభం నుంచి స్లో అండ్ స్టడీ విధానాన్ని అవలంభిస్తూ.. మంచి మంచి పాత్రలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నటుడు రానా దగ్గుబాటి.

గ్రేటర్ ఫలితాల తర్వాత టీఆర్ఎస్ కు మరో భారీ షాక్..

గ్రేటర్ ఎన్నికల తర్వాత రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారిపోతున్నాయి.

‘బిగ్‌బాస్ విన్నర్ అభి.. రన్నర్‌గా సొహైల్..’

కొన్ని వారాలుగా ప్రేక్షకులను ఎంతగానో అలరించిన బిగ్‌బాస్ షో ముగింపు దశకు వచ్చేసింది. బిగ్‌బాస్ సీజన్ 3కి మాదిరిగానే..