Kishan Reddy:పవన్ కల్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేయలేదు: కిషన్ రెడ్డి
- IndiaGlitz, [Monday,December 11 2023]
ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, జనసేన కలిసి పోటీ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఎన్నికల్లో ఆ కూటమి ఓడిపోవడం.. జనసేన అభ్యర్థులు ఒక్కరూ గెలవలేకపోయారు. దీంతో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి జనసేనాని పవన్ కళ్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారని జోరుగా ప్రచారం జరిగింది. ఇది సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కిషన్ రెడ్డి స్పందించారు.
అందరికీ నమస్కారం. ఇటీవల జరిగిన తెలంగాణ ఎన్నికల ప్రచారం సందర్భంలో జనసేనతో కలిసి బీజేపీ పోటీ చేసిన సంగతి మీకు తెలిసిందే. ఈ నిర్ణయం రెండు పార్టీలు ఆలోచించి తీసుకున్నదే. ఎన్డీయే భాగస్వామ్య పక్షంగా ఉన్నందునే మేము.. జనసేనతో కలిసి బరిలో దిగాం. అయితే ఆదివారం సాయంత్రం నుంచి సోషల్ మీడియాలో కొందరు.. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై నేను అనుచిత వ్యాఖ్యలు చేసినట్లుగా దుష్ప్రచారం చేస్తున్నారు. ఈ దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇలాంటి అసత్యాలను ఉద్దేశపూర్వకంగా ప్రచారం చేస్తున్నవారిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నాను అని ఆయన ట్వీట్ చేశారు.
తెలంగాణలో అంతగా బలం లేని జనసేన పార్టీతో బీజేపీ ఎందుకు పొత్తు పెట్టుకుందని ఎన్నికలకు ముందే అనేక ప్రశ్నలు తలెత్తాయి. ఆ పార్టీతో పొత్తు బీజేపీకి నష్టం చేకూరుస్తుందనే వాదనలు వినిపించాయి. అయితే ఎన్డీయే భాగస్వామ్య పక్షంగా ఉన్నందునే జనసేనతో కలిసి బరిలో దిగామని కిషన్ రెడ్డి తెలిపారు. కాగా 119 నియోజకవర్గాలకు గాను బీజేపీ 111, జనసేన 8 స్థానాల్లో పోటీ చేశాయి. బీజేపీ గతంలో కంటే 7 స్థానాలు ఎక్కువ గెలిచి 8 స్థానాలతో సరిపెట్టుకుంది. ఇక జనసేన మాత్రం పోటీ చేసిన 8 నియోజకవర్గాల్లో డిపాజిట్లు కోల్పోయింది. దీంతో తెలంగాణ ఎన్నికల్లో పవన్ కల్యాణ్ పీకింది ఏం లేదని.. కనీసం ఆయన ప్రచారం చేసిన చోట్ల డిపాజిట్లు కూడా రాలేదని కిషన్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు ప్రచారం జరిగింది.
అందరికీ నమస్కారం,
— G Kishan Reddy (@kishanreddybjp) December 10, 2023
ఇటీవల జరిగిన తెలంగాణ ఎన్నికల ప్రచారం సందర్భంలో జనసేనతో కలిసి బీజేపీ పోటీ చేసిన సంగతి మీకు తెలిసిందే. ఈ నిర్ణయం రెండు పార్టీలు ఆలోచించి తీసుకున్నదే. ఎన్డీయే భాగస్వామ్య పక్షంగా ఉన్నందునే మేము.. జనసేనతో కలిసి బరిలో దిగాం.
అయితే, ఆదివారం సాయంత్రం నుంచి సోషల్…