Kishan Reddy:కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేస్తారా , లేదా  .. మౌనం వీడిన కిషన్ రెడ్డి

  • IndiaGlitz, [Wednesday,July 05 2023]

ఎన్నికలకు సమయం దగ్గరైన వేళ తెలంగాణ బీజేపీలో మార్పులు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా వున్న బండి సంజయ్ తన పదవికి రాజీనామా చేయగా.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని ఆ స్థానంలో కూర్చోబెట్టింది బీజేపీ హైకమాండ్. ఇదే సమయంలో కేంద్ర మంత్రి వర్గం నుంచి కిషన్ రెడ్డిని తప్పిస్తారని ప్రచారం జరుగుతోంది. అయితే అంతకంటే ముందే ఆయన రాజీనామా చేస్తారంటూ వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కిషన్ రెడ్డి స్పందించారు. కేంద్ర మంత్రి పదవికి తాను రాజీనామా చేయడం లేదన్నారు.

వదంతులు నమ్మొద్దు :

అధికారిక ప్రకటనలు మాత్రమే నమ్మాలని.. వదంతులను నమ్మొద్దని కిషన్ రెడ్డి సూచించారు. కేంద్ర మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ వరకు తాను కేంద్రమంత్రిగా కొనసాగుతానని క్లారిటీ ఇచ్చారు. ఈ రోజు సాయంత్రం ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు వస్తానని , ఆ తర్వాత కీలక నేతలతో భేటీ అయి పలు విషయాలపై చర్చిస్తానని చెప్పారు. ఇవాళ్టీ వరకు తాను పార్టీని ఏదీ కావాలని కోరలేదని.. తెలంగాణ ఏర్పాటయ్యాక రాష్ట్ర బీజేపీ తొలి అధ్యక్షుడిగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రెండుసార్లు పనిచేశానని కిషన్ రెడ్డి గుర్తుచేశారు. పార్టీ ఆదేశిస్తే.. ఏ పని చేయడానికైనా తాను సిద్ధమేనని ఆయన స్పష్టం చేశారు. వరంగల్‌లో ప్రధాని నరేంద్ర మోడీ సభను విజయవంతం చేస్తామని కిషన్ రెడ్డి తెలిపారు. ఈ నెల 9న దక్షిణాది రాష్ట్రాల బీజేపీ నేతలు హైదరాబాద్‌లో సమావేశమవుతారని ఆయన వివరించారు.

మంత్రి వర్గ విస్తరణ వరకు పదవిలోనే :

కాగా.. కిషన్ రెడ్డికి కేంద్ర మంత్రిగానే వుండాలని వుందంటూ వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. కానీ హైకమాండ్ ఒత్తిడితోనే ఆయన అన్యమనస్కకంగానే తెలంగాణ బీజేపీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించేందుకు ఓకే చెప్పారని ప్రచారం జరుగుతోంది. అందుకే రాజీనామా చేయకుండా.. మంత్రి వర్గ పునర్ వ్యవస్థీకరణ వరకు వేచి చూసే ధోరణిని కిషన్ రెడ్డి అవలంభిస్తున్నారని గాసిప్స్ గుప్పుమన్నాయి. మరి చూద్దాం .. ఏం జరుగుతుందో.

More News

Jude Anthany Joseph:అగ్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌లో ‘2018’ డైరెక్టర్ జూడ్ ఆంథని జోసెఫ్ సినిమా

సినీ ప్రేమికులకు ఎప్ప‌టిక‌ప్పుడు భారీ చిత్రాలు, విజువ‌ల్ వండ‌ర్స్ చిత్రాల‌నే కాదు.. వైవిధ్య‌మైన కాన్సెప్ట్ మూవీస్‌ను కూడా అందిస్తోన్న అగ్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడ‌క్ష‌న్స్‌

Raghunandan Rao : బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు అరెస్ట్

తెలంగాణ బీజేపీ సీనియర్ నేత, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావును పోలీసులు అరెస్ట్ చేశారు.

Deepika:హిందూపురంలో బాలయ్యపై మహిళా అస్త్రం .. జగన్ వ్యూహం, ఇన్‌ఛార్జ్‌గా టీఎన్ దీపిక..?

హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గం.. ఈ స్థానానికి ఉమ్మడి ఏపీలో కానీ, నవ్యాంధ్రలో కానీ ప్రత్యేక స్థానముంది.

Niharika:పరస్పర అంగీకారంతోనే విడిపోయాం .. అర్ధం చేసుకోండి, కొంచెం ప్రైవసీ కావాలి : విడాకులపై నిహారిక రియాక్షన్

మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక తన భర్త జొన్నలగడ్డ చైతన్యతో కొన్నాళ్లుగా విడిగా వుంటున్న సంగతి తెలిసిందే.

Samantha:సమంత సంచలన నిర్ణయం : సినిమాలకు బ్రేక్ , శాశ్వతంగానా.. టెంపరరీనా..?

గత కొంతకాలంగా వ్యక్తిగత జీవితంతో పాటు వృత్తి జీవితంలోనూ ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నారు అగ్ర కథానాయిక సమంత.