ఆ విషయం సీఎం కేసీఆరే బయటపెట్టాలి: కిషన్ రెడ్డి
Send us your feedback to audioarticles@vaarta.com
కొన్ని అరాచక శక్తులు తెలంగాణలో మత విద్వేషాలను రెచ్చగొట్టేందుకు యత్నిస్తున్నాయంటూ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై నేడు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం ఎవరు కల్పిస్తున్నారో ముఖ్యమంత్రి కేసీఆరే బయటపెట్టాలని డిమాండ్ చేశారు. లా అండ్ ఆర్డర్ సమస్యలుంటే ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవటం లేదని ప్రశ్నించింది.
ప్రభుత్వం ఫిర్యాదు చేస్తే.. కేంద్రం రోహింగ్యాలను వెనక్కి పంపిస్తుందని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. పాతబస్తీలో రోహింగ్యాలు ఉన్నారన్న సమాచారం తమకుందని వెల్లడించారు.
రాష్ట్ర సమస్యలను వదిలేసి కేటీఆర్ జాతీయ అంశాలను మాట్లాడటం చేతకాని తనమన్నారు. మహానాయకులు ఎన్టీఆర్, పీవీలను బీజేపీ గౌరవిస్తోందన్నారు. తేజస్వీ సూర్యపై ఓయూ పోలీసులు కేసు నమోదు చేయటాన్ని ఖండిస్తున్నానని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.
కాగా.. బుధవారం సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. తీవ్ర నిరాశ నిస్పృహల్లో ఉన్న కొన్ని అరాచక శక్తులు హైదరాబాద్ నగరంలో, తెలంగాణ రాష్ట్రంలో మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి కుట్ర పన్నుతున్నాయన్నారు. సామరస్య వాతావరణాన్ని దెబ్బతీసి రాజకీయ ప్రయోజనం పొందాలనుకునే అలాంటి వ్యక్తులు, శక్తుల పట్ల అత్యంత కఠినంగా వ్యవహరించాలన్నారు. సంఘ విద్రోహ శక్తులను ఉక్కుపాదంతో అణచివేయాలని సీఎం కేసీఆర్ పోలీసు అధికారులను ఆదేశించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout