Kirrak RP: రోజాకు ఇచ్చిపడేసిన కిర్రాక్ ఆర్పీ.. మామూలు పంచ్‌లు కాదుగా..
Send us your feedback to audioarticles@vaarta.com
ఏపీ ఎన్నికల ప్రచారంలో రోజురోజుకు ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఒకే కుటుంబానికి చెందిన వారు ఇప్పుడు ప్రత్యర్థులుగా మారిపోయారు. ఇప్పుడు మొన్నటివరకు కలిసి ఉన్న మంత్రి రోజా, జబర్దస్త్ నటులు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమన్న పరిస్థితులు నెలకొన్నాయి. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుపుతో పాటు కూటమి అభ్యర్థుల కోసం జబర్దస్త్ నటులు ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలో జబర్దస్త్ కమెడియన్లపై రోజా ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేశారు. వాళ్లంతా చిన్నచిన్న నటులు అని.. డబ్బుల కోసం పనిచేసేవాళ్ళు.. మెగా ఫ్యామిలీకి ఎదురు వెళితే ఇండస్ట్రీలో లేకుండా చేస్తారని భయంతోనే జనసేనకు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.
దీనిపై ఇప్పటికే గెటప్ శ్రీను కౌంటర్ ఇవ్వగా.. తాజాగా కిర్రాక్ ఆర్పీ ఓ రేంజులో ఫైరయ్యారు. "మమ్మల్ని గౌరవిస్తే రోజా గారు అని పిలుస్తాం. గౌరవించకపోతే రోజా అంటాం. వాళ్లంతా చిన్నచిన్న ఆర్టిస్టులంట. ఈవిడేమైనా 15 నేషనల్ అవార్డులు, 10 ఆస్కార్ అవార్డులు కొట్టిందా యువరాణి. వాళ్లు స్వచ్ఛందంగా పవన్ కళ్యాణ్ మీద అభిమానంతో ప్రచారం చేస్తున్నారు. టీడీపీ మీద ఇష్టం ఉంది. మీ ప్రభుత్వంపైన వ్యతిరేకత ఉంది. చిన్నచిన్న ఆర్టిస్టులు అంటున్నావ్. నీకు దమ్ముంటే గెటప్ శ్రీను వేసే క్యారెక్టర్ లాంటి క్యారెక్టర్ జీవితంలో ఒక్కటైనా చేయగలవా?. సుడిగాలి సుధీర్ మ్యాజిక్ చేసి కష్టపడి పైకొచ్చాడు. సినిమా హీరోగా చేస్తున్నాడు. నీ కంటే పదిరెట్లు ఎక్కువ ఫాలోయింగ్ ఉంది. వాడితో నువ్వు పోటీపడగలవా? ఆది జబర్దస్త్ చరిత్రనే మార్చేశాడు. వాడిలా నువ్వు గంటసేపు నవ్వించగలవా? నీ బతుకులో వీళ్ల ముగ్గురి లాంటి ఛరిష్మాను చూశావా?
వచ్చే ఎన్నికల్లో ఫస్ట్ ఓడిపోయే సీటే నగరి. నగరిలో రోజాకు డిపాజిట్లు కూడా రావు. జనసేనలో ఏడు మంది హీరోలు ఉంటే.. రోజా వాళ్ల అన్నల దగ్గర 70 మంది రౌడీలు ఉన్నారు. నీకు దమ్ముంటే వారిని ఎదిరించి చూడు. లేపేస్తారు. ఆవిడను గౌరవించాం. నీ పని నువ్వు చూస్కో. ఎవరూ ఏమీ అనలేదు. ఎందుకు ఉలికిపడుతున్నావ్. వాళ్లు స్వచ్ఛందంగా పవన్ కళ్యాణ్‌కు ప్రచారం చేస్తున్నారు. నీలాగా దిగజారిపోయి బతకడం లేదు. నోరు మూసుకుని నీ ప్రచారం నువ్వు చేస్కో. వీలైతే జనసేనకు సపోర్ట్ చేయి. బాగుంటుంది. జూన్ నాలుగో తేదీన అందరి లెక్కలు తేలుస్తాం చూడు" అని హెచ్చరించారు. దీంతో ఆర్వీ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout