ముందుగానే 'కిరాక్ పార్టీ'
Send us your feedback to audioarticles@vaarta.com
వరుస విజయాలతో, వైవిధ్యమైన పాత్రలతో దూసుకుపోతున్న యువ కథానాయకుడు నిఖిల్ నటిస్తున్న చిత్రం 'కిరాక్ పార్టీ'. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ నిర్మిస్తోంది. సిమ్రన్ పర్జీనా, సంయుక్త హెగ్డే కథానాయికలుగా నటిస్తున్నారు.
ఏ టీవీ సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మాత. శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వం వహించారు.ప్రముఖ దర్శకులు సుధీర్ వర్మ ఈ చిత్రానికి స్ర్కీన్ ప్లేనీ, మరో దర్శకుడు చందూ మొండేటి సంభాషణలనూ అందించడం విశేషం.
ఈ సినిమాను ఫిబ్రవరిలో విడుదల చేద్దామనుకున్నారు కానీ కొన్ని అనివార్య కారణాలతో సినిమాను అనుకున్న సమయంలో విడుదల చేయలేకపోయారు. ఇప్పుడు మార్చి 23న విడుదల చేయాలని ముందుగా అనుకున్నారు.
కానీ మారుతున్న పరిస్థితుల దృష్ట్యా ఓ వారం ముందుగానే అంటే మార్చి 16నే సినిమాను విడుదల చేయాలని అనుకుంటున్నారట. తర్వలోనే విడుదల తేదీపై ఓ అధికారిక సమాచారం రానుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com