మార్చ్ 16 న విడుదల కానున్న 'కిర్రాక్ పార్టీ'
Send us your feedback to audioarticles@vaarta.com
నిఖిల్ హీరోగా యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా తెరెకెక్కిన కిర్రాక్ పార్టీ చిత్రాన్ని మార్చ్ 16 న ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదల చేయనున్నారు. చిత్రం షూటింగ్ పూర్తికాగా, శరవేగంగా పోస్ట్-ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తిచేసుకుంటుంది. ఇటీవలే విడుదలైన 'కిర్రాక్ పార్టీ' టీజర్ మరియు పాటలకు విశేష స్పందన వస్తుంది. నిఖిల్ స్టైలిష్ మ్యాచో లుక్స్ చిత్రంపై అంచనాలను మరింత పెంచేసాయి. కాలేజీ క్యాంపస్ డ్రామాగా వస్తుండడంతో 'కిర్రాక్ పార్టీ' నిఖిల్ కు 'హ్యాపీ డేస్' తరహా మరో భారీ విజయం అవుతుందని అంతా ఆశిస్తున్నారు.
కిర్రాక్ పార్టీ తో శరన్ కొప్పిశెట్టి దర్శకునిగా పరిచయమవుతున్నారు. నిఖిల్ తో 'స్వామి రా రా', 'కార్తికేయ' వంటి హిట్ చిత్రాలు తీసిన దర్శకులు సుధీర్ వర్మ, చందూ మొండేటి ఈ చిత్రానికి స్క్రీన్-ప్లే, మాటలు రాయడం మరో విశేషం. సంయుక్త హెగ్డే, సిమ్రాన్ పరీన్జ నిఖిల్ సరసన హీరోయిన్ లు గా నటిస్తున్నారు. రామబ్రహ్మం సుంకర, కిషోర్ గరికిపాటి, అజయ్ సుంకర, అభిషేక్ అగ్రవాల్ నిర్మాతలుగా ఏ.కే. ఎంటర్టైన్మెంట్స్ మరియు ఏటివి బ్యానర్ ల పై నిర్మిస్తున్న కిర్రాక్ పార్టీ మార్చ్ 16 న ప్రపంచ వ్యాప్తంగా భారీ గా విడుదల కానుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments