మార్చ్ 16 న విడుదల కానున్న 'కిర్రాక్ పార్టీ'

  • IndiaGlitz, [Friday,March 02 2018]

నిఖిల్ హీరోగా యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా తెరెకెక్కిన కిర్రాక్ పార్టీ చిత్రాన్ని మార్చ్ 16 న ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదల చేయనున్నారు. చిత్రం షూటింగ్ పూర్తికాగా, శరవేగంగా పోస్ట్-ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తిచేసుకుంటుంది. ఇటీవలే విడుదలైన 'కిర్రాక్ పార్టీ' టీజర్ మరియు పాటలకు విశేష స్పందన వస్తుంది. నిఖిల్ స్టైలిష్ మ్యాచో లుక్స్ చిత్రంపై అంచనాలను మరింత పెంచేసాయి. కాలేజీ క్యాంపస్ డ్రామాగా వస్తుండడంతో 'కిర్రాక్ పార్టీ' నిఖిల్ కు 'హ్యాపీ డేస్' తరహా మరో భారీ విజయం అవుతుందని అంతా ఆశిస్తున్నారు.

కిర్రాక్ పార్టీ తో శరన్ కొప్పిశెట్టి దర్శకునిగా పరిచయమవుతున్నారు. నిఖిల్ తో 'స్వామి రా రా', 'కార్తికేయ' వంటి హిట్ చిత్రాలు తీసిన దర్శకులు సుధీర్ వర్మ, చందూ మొండేటి ఈ చిత్రానికి స్క్రీన్-ప్లే, మాటలు రాయడం మరో విశేషం. సంయుక్త హెగ్డే, సిమ్రాన్ పరీన్జ నిఖిల్ సరసన హీరోయిన్ లు గా నటిస్తున్నారు. రామబ్రహ్మం సుంకర, కిషోర్ గరికిపాటి, అజయ్ సుంకర, అభిషేక్ అగ్రవాల్ నిర్మాతలుగా ఏ.కే. ఎంటర్టైన్మెంట్స్ మరియు ఏటివి బ్యానర్ ల పై నిర్మిస్తున్న కిర్రాక్ పార్టీ మార్చ్ 16 న ప్రపంచ వ్యాప్తంగా భారీ గా విడుదల కానుంది.

More News

ఈ ఏడాది ప్రథమార్థం అందుకే స్పెషల్

ఈ ఏడాది ప్రథమార్థం తెలుగు సినిమా అభిమానులకు ఒక రకంగా స్పెషల్ అనే చెప్పాలి.

మ‌హేష్‌, ఎన్టీఆర్ కాంబినేష‌న్స్‌లో డ‌బుల్ ధ‌మాకా

'ఒక లైలా కోసం'(2014), 'ముకుంద'(2014), 'దువ్వాడ జగన్నాథ‌మ్' (2017) .. ఇలా ఇప్ప‌టివ‌ర‌కు మూడు తెలుగు సినిమాల్లో నటించినా.. చెప్పుకోదగ్గ విజయాన్నైతే తన ఖాతాలో వేసుకోలేదు ఉత్త‌రాది పూజా హెగ్డే.

సాయిధ‌ర‌మ్‌, క‌రుణాక‌ర‌న్ ఫిల్మ్ ఎప్పుడంటే..

20 ఏళ్ల క్రితం విడుద‌లైన తొలి ప్రేమ చిత్రంతో.. ప్రేమ‌క‌థా చిత్రాల ప‌రంగా ఓ ట్రెండ్ సృష్టించారు ద‌ర్శ‌కుడు ఎ.క‌రుణాక‌ర‌న్. జ‌యాప‌జ‌యాల సంగ‌తి ప‌క్క‌న పెడితే.. త‌న ప్ర‌తి చిత్రంతోనూ కుటుంబ ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేశారు ఈ ప్రేమ‌క‌థా చిత్రాల స్పెష‌లిస్ట్.

తక్కువ గ్యాప్ లో నాలుగు చిత్రాలతో..

పెళ్ళిచూపులు చిత్రంతో సోలో హీరోగా తొలి హిట్ ను అందుకున్న యువ కథానాయకుడు విజయ్ దేవరకొండ..

ఎన్టీఆర్ లాగే త్రివిక్ర‌మ్ కూడా హిట్ కొడ‌తాడా?

తెలుగు వారికి ఇష్టమైన పండగ అంటే.. అది సంక్రాంతి అనే చెప్పాలి. ఈ పండగ స‌మ‌యంలో విజయం సాధిస్తే ఏడాదంతా విజయలక్ష్మి వారితో ఉంటుందని నమ్మకం.