Bigg Boss 7 Telugu : బిగ్‌బాస్ 7లో తొలి వికెట్ డౌన్.. ఎలిమినేటైన కిరణ్ రాథోడ్, షకీలా కన్నీరుమున్నీరు
Send us your feedback to audioarticles@vaarta.com
బిగ్‌బాస్ 7లో సండే సందడి షురూ అయ్యింది. కింగ్ నాగార్జున వచ్చి రావడంతోనే ఆటలు, పాటలతో అలరించారు. కిరణ్ రాథోడ్ తెలుగు నేర్చుకోవడం గురించి టెస్ట్ పెట్టారు. తిన్నారా, బాగున్నారా అని అడిగితే.. ఇవి నిన్ననే అడిగేశావు అని నాగ్ కౌంటరిచ్చాడు. మగపిల్లలు వర్సెస్ ఆడపిల్లలు గేమ్‌లో అందరూ కలిసి టేస్టీ తేజను బకరాను చేశారు. కళ్లకు గంతలు కట్టుకుని చేతిలోని బొమ్మ పాముతో అమ్మాయిలను కొట్టాలి. అమ్మాయిలు కూడా ఇదే చేయాలి. ఈ క్రమంలో తేజ కిందపడిపోవడంతో హౌస్‌లో నవ్వులు పూశాయి. తేజ వల్ల కావడంతో అమర్‌దీప్ రంగంలోకి దిగాడు. ఏదో పీకుతాడులే అనుకుంటే వెంటనే టైమ్ అయిపోయింది. ఆడపిల్లలంతా వెళ్లిపోతున్నారంటూ అమర్‌దీప్ కుంటి సాకులు చెప్పడంతో నాగ్.. ‘‘ఆడలేక మద్దెలు’’ అంటూ పాత సామెత చెప్పాడు.
అమ్మాయిల్లో తొలుత రంగంలోకి దిగిన శుభశ్రీ.. కళ్లకు గంతలు కట్టుకుని దొరికిన వారిని దొరికినట్లుగా కొట్టింది. ఆట బాగా ఆడాలన్న కంగారులో వెళ్లి గోడకు గుద్దుకుంది. అబ్బాయిలను కొట్టమంటే అమ్మాయిలను కూడా బాదేసింది. ఈమె ఆట నవ్వులు పూయించింది. తేజ, అమర్‌దీప్, శోభా శెట్టి ఎవరినీ టచ్ చేయలేకపోగా.. శుభశ్రీ మాత్రం నలుగురిని టచ్ చేసింది. ఆటల హడావుడి తగ్గిన తర్వాత కాసేపు ఇంటి సభ్యులు సేద తీరారు. వారిని రిలాక్స్ చేసేందుకు గాను నాగార్జున కొన్ని మీమ్స్ చూపించారు. అందులో శోభా శెట్టిపై మీమ్ వచ్చింది. శోభా శెట్టి విత్ రియల్ డాక్టర్ బాబు అంటూ శోభతో పాటు గౌతమ్ కృష్ణ ఫోటో వచ్చింది. దీంతో అంతా నవ్వుకున్నారు.
పవర్ అస్త్రను గెలుచుకున్న ఆట సందీప్‌కు బంపరాఫర్ ప్రకటించాడు బిగ్‌బాస్. అతనిని వీఐపీ రూమ్‌లో వుండమన్నాడు. అలాగే పవర్ అస్త్ర వుంది కదా అని ఏ పని చేయనంటే కుదరదని చెప్పి.. ఒక బ్యాటరీ వుంటుందని, దీనిని ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ వుండాలని నాగ్ తెలిపాడు. ఇందులో రెడ్ మార్క్ వస్తే డేంజర్ జోన్‌లోకి వెళ్లిపోతావని నాగ్ వార్నింగ్ ఇచ్చాడు.
ఆ తర్వాత ఎలిమినేషన్ ప్రాసెస్ మొదలుపెట్టారు నాగ్. నామినేషన్స్‌లో వున్న ఎనిమిది మందిని పిలిచి.. వారికి చినన సైజు శవపేటికల్లాంటి బాక్స్‌లు ఇచ్చాడు. అందులో పూలు వుంటే సేఫ్.. అస్థి పంజరం వుంటే డేంజర్ అని చెప్పాడు. ఈ టాస్క్‌లో తొలుత రతిక, శోభా శెట్టి సేవ్ కాగా.. కిరణ్, ప్రశాంత్, దామిని, ప్రిన్స్, గౌతమ్, షకీలాలు డేంజర్‌లో పడ్డారు. చివరికి ప్రిన్స్, కిరణ్ మాత్రం మిగలగా.. వారిని యాక్టివిటీ రూంలోకి పిలిచాడు బిగ్‌బాస్. అక్కడ ఎవరిపై రెడ్ కలర్ స్పాట్‌లైట్ పడుతుందో వారు ఎలిమినేట్ అయినట్లు అని చెప్పారు. ప్రిన్స్‌పై గ్రీన్ లైట్ పడటంతో అతను సేవ్ అవ్వగా.. కిరణ్ ఎలిమినేట్ అయినట్లు నాగ్ ప్రకటించాడు. దీంతో బిగ్‌బాస్ 7లో ఎలిమినేట్ అయిన తొలి కంటెస్టెంట్‌గా కిరణ్ రాథోడ్ నిలిచింది.
అనంతరం ఆమెను స్టేజ్ మీదకు పిలిచిన నాగ్ ఓ టాస్క్ ఇచ్చాడు. కంటెస్టెంట్స్‌లో నలుగురికి ఉల్టా, నలుగురికి సీదా ట్యాగ్ ఇవ్వమని చెప్పాడు. ప్రిన్స్, షకీలా, శివాజీ, శుభశ్రీ సీదా క్యారెక్టర్స్ అని చెప్పింది. ప్రశాంత్, రతిక, శోభాశెట్టి, టేస్టీ తేజలకు ఉల్టా ట్యాగ్ ఇచ్చింది. అయితే కిరణ్ ఎలిమినేట్ కావడంతో షకీలా బాగా ఎమోషనల్ అయ్యింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments