మార్చి 4న ప్రేక్షకుల ముందుకు సెబాస్టియన్ పీసీ 524.... హ్యాట్రిక్ హిట్‌పై కన్నేసిన కిరణ్ అబ్బవరం
Send us your feedback to audioarticles@vaarta.com
వినూత్నమైన కథలతో దూసుకెళ్తున్నాడు యువ హీరో కిరణ్ అబ్బవరం. రాజావారు రాణివారు సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఆయన రెండో సినిమా ఎస్ఆర్ కళ్యాణ మండపంతో యూత్‌కి బాగా కనెక్ట్ అయ్యారు. కిరణ్ నటించిన తాజా సినిమా .. సెబాస్టియన్ పీసీ 524. జ్యోవిత సినిమాస్ పతాకంపై ఎలైట్ ఎంటర్టైన్మెంట్ సమర్పిస్తోంది. కిరణ్ అబ్బవరం సరసన కోమలీ ప్రసాద్, నువేక్ష హీరోయిన్లుగా నటించారు.
శ్రీకాంత్ అయ్యంగార్, సూర్య, రోహిణీ రఘువరన్, ఆదర్ష్ బాలకృష్ణ, జార్జ్, సూర్య, మహేష్ విట్టా, రవితేజ, రాజ్ విక్రమ్, లత, ఇషాన్, రాజేష్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. బాలాజీ సయ్యపురెడ్డి దర్శకత్వం వహించిన ఈ సెబాస్టియన్ పిసి 524ను ప్రపంచవ్యాప్తంగా మార్చి 4న ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట సంస్థ విడుదల చేస్తోంది.
ఈ సందర్భంగా ఆదివారం నిర్మాతలు మాట్లాడుతూ... కిరణ్ అబ్బవరానికి మా సెబాస్టియన్ పిసి 524 ఖచ్చితంగా హ్యాట్రిక్ హిట్ ఇస్తుందన్నారు. జిబ్రాన్ స్వరపరిచిన పాటలన్నీ అద్భుతంగా వచ్చాయని... ముఖ్యంగా హెలి అనే పాటకు ప్రేక్షకుల నుండి ఊహించని రెస్పాన్స్ లభించిందని నిర్మాతలు చెప్పారు. ఇటీవల రిలీజ్ అయిన గ్లిమ్స్ కూడా మంచి టాక్ సొంతం చేసుకుందని... ఆదిత్యా మ్యూజిక్ ద్వారా విడుదలైన ఆడియో కూడా బాగుందన్నారు.
ఇక రేచీకటిని ఇతివృత్తంగా తీసుకుని సెబాస్టియన్ పీసీ 524ను తెరకెక్కించారు. రేచీకటి గల హీరోకి పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగం వస్తుంది. ఈ లోపం వున్నప్పటికీ అతను నైట్ డ్యూటీ ఎలా చేశాడు? రేచీకటి వల్ల హీరోకి ఎటువంటి ఇబ్బందులు ఎదురయ్యాయి? అనేది సినిమా కథ.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com