క్లీన్ U/A సర్టిఫికెట్ అందుకున్న కిరణ్ ఆబ్బవరం 'సెబాస్టియన్‌ పిసి524'

  • IndiaGlitz, [Saturday,February 26 2022]

జ్యోవిత సినిమాస్‌ పతాకంపై ఎలైట్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సమర్పణలో కిరణ్‌ అబ్బవరం కథానాయకుడిగా, కోమలీ ప్రసాద్‌, నువేక్ష (నమ్రతా దరేకర్‌) హీరోయిన్లుగా, సిద్ధారెడ్డి బి, జయచంద్ర రెడ్డి, రాజు, ప్రమోద్‌ నిర్మాతలుగా, బాలాజీ సయ్యపురెడ్డి దర్శకత్వం వహించిన చిత్రం ‘సెబాస్టియన్‌ పిసి524’. ప్రపంచ వ్యాప్తంగా మార్చి 4న సినిమాను ప్రైమ్‌ షో ఎంటర్టైన్మెంట్‌ సంస్థ విడుదల చేస్తోంది. సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు సెన్సార్ వారు ఈ చిత్రానికి క్లీన్ U/A సర్టిఫికెట్ ఇవ్వడం జరిగింది.ఈ సందర్భంగా

చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ.. ఇప్పటి వరకు కిరణ్ చేసింది రెండు చిత్రాలే అయినా తను సెలెక్టివ్ కథలను ఎంచుకొంటూ చాలా సినిమాలు చేస్తూ ఇప్పుడు బిజీ ఆర్టిస్టుగా మారిపోయాడు. తాజా గా కిరణ్‌ అబ్బవరపు నటించిన చిత్రం ‘సెబాస్టియన్‌ పిసి524’. రేచీకటి నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. రేచీకటి గల హీరోకి పోలీస్‌ కానిస్టేబుల్‌ ఉద్యోగం వస్తుంది. అతడు నైట్‌ టైం డ్యూటీ ఎలా చేశాడు? రేచీకటి వల్ల ఎటువంటి ఇబ్బందులు ఎదురయ్యాయి? అనేది సినిమా కథాంశం. జిబ్రాన్‌ సంగీతం దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలోని పాటలన్నీ అద్భుతంగా వచ్చాయి.ఆదిత్యా మ్యూజిక్‌ ద్వారా విడుదలైన ఆడియోకు ప్రేక్షకులనుండి ఊహించలేనటువంటి ట్రెమండస్‌ రెస్పాన్స్‌ లభిస్తుంది.కిరణ్ కు ఈ సినిమా కూడా ఖచ్చితంగా హ్యాట్రిక్‌ హిట్‌ ఇస్తుంది.తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది.ఈ సినిమాకు సెన్సార్ వారు క్లీన్ U/A సర్టిఫికెట్ ఇవ్వడం జరిగింది. ఈ సినిమాను ఫ్యామిలీ అంతా కూర్చొని చూసే విధంగా తెరకెక్కించడం జరిగింది. మార్చి 4 న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న మా సినిమాను ప్రేక్షకులందరూ ఆదరించి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాము అన్నారు.

నటీనటులు కిరణ్‌ అబ్బవరం, కోమలీ ప్రసాద్‌, నువేక్ష (నమ్రతా దారేకర్‌), శ్రీకాంత్‌ అయ్యంగార్‌, సూర్య, రోహిణీ రఘువరన్‌, ఆదర్ష్‌ బాలకృష్ణ, జార్జ్‌, సూర్య, మహేష్‌ విట్టా, రవితేజ, రాజ్‌ విక్రమ్‌, లత, ఇషాన్‌, రాజేష్‌ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు.

More News

హీరోయిన్ సమంతకు .... చాంపియన్స్‌ ఆఫ్‌ ది చేంజ్‌ తెలంగాణ 2021 అవార్డ్

ఓ వైపు క్షణం తీరిక లేకుండా సినిమా షూటింగ్‌లలో పాల్గొంటారు సమంతా. దీనితో పాటు తనను ఇంతటి వారిని చేసిన సమాజానికి ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో సామాజిక కార్యక్రమాలకు కూడా సమయం కేటాయిస్తూ వుంటారామె.

జీ`5 ఓటిటి లో 500 మిలియన్స్ మినిట్స్ వ్యూస్ తో "బంగార్రాజు" విజయ విహారం...

వినోదాత్మక సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు డైరెక్ట్‌-టు-డిజిటల్‌ రిలీజ్‌లతో హిందీ, తెలుగు, తమిళం,కన్నడ, మలయాళం, మరాఠీ, బెంగాలీ, గుజరాతీ వంటి పలు భారతీయ భాషల్లో

భీమ్లా నాయక్: కేసీఆర్‌కు హ్యాట్సాఫ్ చెబుతూ.. బెజవాడలో పవన్ ఫ్యాన్స్ ఫ్లెక్సీ, వైరల్

పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ నటించిన భీమ్లా నాయక్ సినిమాకు ఏపీ ప్రభుత్వం నుంచి గట్టి అవరోధాలు ఎదురైన సంగతి తెలిసిందే.

మార్చి 1న రామారావు ఆన్ డ్యూటీ టీజర్.. రిలీజ్ డేట్ కూడా చెబుతారేమో..?

మహారాజా రవితేజ వరుసగా ప్రాజెక్ట్‌లను పట్టాలెక్కిస్తున్న సంగతి తెలిసిందే.

ఉక్రెయిన్‌లో ఏపీ విద్యార్ధుల అవస్థలు ... విమాన ఖర్చులు భరించండి: అధికారులకు జగన్ ఆదేశం

ఉక్రెయిన్‌పై రష్యా దాడి నేపథ్యంలో అన్ని దేశాలు వారి పౌరుల క్షేమ సమాచారంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.