close
Choose your channels

‘సెబాస్టియన్ పిసి 524’ టీజర్: నవ్వుతూ, నవ్విస్తూ ..హైప్ పెంచేసిన కిరణ్ అబ్బవరం

Saturday, February 5, 2022 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

‘సెబాస్టియన్ పిసి 524’ టీజర్: నవ్వుతూ, నవ్విస్తూ ..హైప్ పెంచేసిన కిరణ్ అబ్బవరం

ప్రతిభావంతులకు ఎప్పుడూ టాలీవుడ్‌ గ్రాండ్ వెల్‌కమ్ చెబుతూనే వుంటుంది. దీనికి ఎన్నో ఉదాహరణలు. అలాంటి టాలెంటెడ్ నటుల్లో ఒకరు కిరణ్ అబ్బవరం.రాజావారు రాణిగారు సినిమాతో ఆయన హీరోగా ఎంట్రీ ఇచ్చారు. అనంతరం కిరణ్ క‌థ అందించిన ఎస్‌.ఆర్‌.క‌ళ్యాణ మండ‌పం చిత్రం ఘన విజయాన్ని అందుకుంది. తద్వారా యువతలో కిరణ్‌కు మంచి క్రేజ్ వచ్చింది.

‘సెబాస్టియన్ పిసి 524’ టీజర్: నవ్వుతూ, నవ్విస్తూ ..హైప్ పెంచేసిన కిరణ్ అబ్బవరం

తాజాగా ఆయన హీరోగా నటిస్తున్న సినిమా ‘సెబాస్టియన్ పిసి 524'. ఎలైట్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ సమర్పణలో జ్యోవిత సినిమాస్ పతాకంపై సిద్ధారెడ్డి బి, రాజు, ప్రమోద్ నిర్మించారు. బాలాజీ సయ్యపురెడ్డి దర్శకత్వం వహించారు. కోమలీ ప్రసాద్‌, నువేక్ష హీరోయిన్లుగా నటిస్తున్నారు. శ్రీకాంత్ అయ్యంగార్, సూర్య, రోహిణీ రఘువరన్, ఆదర్ష్ బాలకృష్ణ, జార్జ్, సూర్య, మహేష్ విట్టా, రవితేజ, రాజ్ విక్రమ్, లత, ఇషాన్, రాజేష్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఫిబ్రవరి 25న ‘సెబాస్టియన్ పిసి 524' ఈ సినిమా విడుదల కానుంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాల్లో వేగంగా పెంచింది. దీనిలో భాగంగా సెబాస్టియన్ పీసీ 524 మూవీ టీజర్‌ను రిలీజ్ చేశారు.

‘సెబాస్టియన్ పిసి 524’ టీజర్: నవ్వుతూ, నవ్విస్తూ ..హైప్ పెంచేసిన కిరణ్ అబ్బవరం

'నీకు రేచీకటి (నైట్ బ్లైండ్‌నెస్‌) అన్న విషయం ఎవ్వరికీ తెలియనివ్వొద్దయ్యా!' అని అమ్మ చెప్పే ఒక మాటతో టీజర్ మొదలైంది. తర్వాత కానిస్టేబుల్ సెబాస్టియన్ పాత్రలో.. జాకీ చాన్ స్టయిల్‌లో కిరణ్ అబ్బవరం రాయల్ ఎంట్రీ బాగుంది. 'పేరేమో క్రిస్టియన్ లాగా ఉండాది.. వచ్చింది ఏమో గుడి కాడనుండా' అని శ్రీకాంత్ అయ్యంగార్ చెప్పే పంచ్ డైలాగ్ బాగుంది.

'దయగల ప్రభువా... ఈ రాత్రి మదనపల్లి పట్టణ ప్రజలకు ఏ ఇబ్బందీ రాకుండా చూడు తండ్రి. నీకు స్తోత్రం', 'ప్రభువా... ఒకరాత్రి వీళ్లకు కళ్లు కనపడకుండా చూడు ప్రభువా! ఎన్ని వణుకుతాయో అర్థం కావడం లేదు', 'నేను దేవుడి బిడ్డను కాదన్నమాట' అని కిరణ్ చెప్పే డైలాగులు నవ్వులు పండిస్తున్నాయి. చూస్తుంటే ఇది ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్‌టైన్‌లా వుంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.   

Comments

Welcome to IndiaGlitz comments! Please keep conversations courteous and relevant to the topic. To ensure productive and respectful discussions, you may see comments from our Community Managers, marked with an "IndiaGlitz Staff" label. For more details, refer to our community guidelines.
settings
Login to post comment
Cancel
Comment