‘సెబాస్టియన్ పిసి 524’ టీజర్: నవ్వుతూ, నవ్విస్తూ ..హైప్ పెంచేసిన కిరణ్ అబ్బవరం

  • IndiaGlitz, [Saturday,February 05 2022]

ప్రతిభావంతులకు ఎప్పుడూ టాలీవుడ్‌ గ్రాండ్ వెల్‌కమ్ చెబుతూనే వుంటుంది. దీనికి ఎన్నో ఉదాహరణలు. అలాంటి టాలెంటెడ్ నటుల్లో ఒకరు కిరణ్ అబ్బవరం.రాజావారు రాణిగారు సినిమాతో ఆయన హీరోగా ఎంట్రీ ఇచ్చారు. అనంతరం కిరణ్ క‌థ అందించిన ఎస్‌.ఆర్‌.క‌ళ్యాణ మండ‌పం చిత్రం ఘన విజయాన్ని అందుకుంది. తద్వారా యువతలో కిరణ్‌కు మంచి క్రేజ్ వచ్చింది.

తాజాగా ఆయన హీరోగా నటిస్తున్న సినిమా ‘సెబాస్టియన్ పిసి 524'. ఎలైట్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ సమర్పణలో జ్యోవిత సినిమాస్ పతాకంపై సిద్ధారెడ్డి బి, రాజు, ప్రమోద్ నిర్మించారు. బాలాజీ సయ్యపురెడ్డి దర్శకత్వం వహించారు. కోమలీ ప్రసాద్‌, నువేక్ష హీరోయిన్లుగా నటిస్తున్నారు. శ్రీకాంత్ అయ్యంగార్, సూర్య, రోహిణీ రఘువరన్, ఆదర్ష్ బాలకృష్ణ, జార్జ్, సూర్య, మహేష్ విట్టా, రవితేజ, రాజ్ విక్రమ్, లత, ఇషాన్, రాజేష్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఫిబ్రవరి 25న ‘సెబాస్టియన్ పిసి 524' ఈ సినిమా విడుదల కానుంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాల్లో వేగంగా పెంచింది. దీనిలో భాగంగా సెబాస్టియన్ పీసీ 524 మూవీ టీజర్‌ను రిలీజ్ చేశారు.

'నీకు రేచీకటి (నైట్ బ్లైండ్‌నెస్‌) అన్న విషయం ఎవ్వరికీ తెలియనివ్వొద్దయ్యా!' అని అమ్మ చెప్పే ఒక మాటతో టీజర్ మొదలైంది. తర్వాత కానిస్టేబుల్ సెబాస్టియన్ పాత్రలో.. జాకీ చాన్ స్టయిల్‌లో కిరణ్ అబ్బవరం రాయల్ ఎంట్రీ బాగుంది. 'పేరేమో క్రిస్టియన్ లాగా ఉండాది.. వచ్చింది ఏమో గుడి కాడనుండా' అని శ్రీకాంత్ అయ్యంగార్ చెప్పే పంచ్ డైలాగ్ బాగుంది.

'దయగల ప్రభువా... ఈ రాత్రి మదనపల్లి పట్టణ ప్రజలకు ఏ ఇబ్బందీ రాకుండా చూడు తండ్రి. నీకు స్తోత్రం', 'ప్రభువా... ఒకరాత్రి వీళ్లకు కళ్లు కనపడకుండా చూడు ప్రభువా! ఎన్ని వణుకుతాయో అర్థం కావడం లేదు', 'నేను దేవుడి బిడ్డను కాదన్నమాట' అని కిరణ్ చెప్పే డైలాగులు నవ్వులు పండిస్తున్నాయి. చూస్తుంటే ఇది ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్‌టైన్‌లా వుంది.

More News

ఇకపై సినిమాలు చేయను.. కమెడియన్ రాహుల్ రామకృష్ణ సంచలన నిర్ణయం, ట్వీట్ వైరల్

తెలుగులో నటుడిగా, కమెడియన్‌గా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు రాహుల్ రామకృష్ణ. షార్ట్‌ ఫిలింస్‌ ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన ఆయనకు అర్జున్ రెడ్డి తర్వాత దశ తిరిగింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్‌గా

'గని' నుంచి రోమియో జూలియట్‌‌ సాంగ్.. ఫిబ్రవరి 8న ముహూర్తం, పాడింది ఎవరో తెలుసా..?

కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటిస్తున్న చిత్రం ‘‘గని’’. బాక్సింగ్ నేపథ్యంలో స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ మూవీలో వరుణ్ తేజ్ బాక్సర్‌గా కనిపించనున్నారు.

ఒక్కపూట భోజనంతోనే రెండు నెలలు .. రూ.500 కోసం ఆ పని: కంటతడి పెట్టిస్తోన్న సమంత ఫ్లాష్‌ బ్యాక్

జీవితం ఎవరికీ వడ్డించిన విస్తరి కాదు.. ఇప్పుడు వెండితెర మీద స్టార్లుగా వెలుగొందుతున్న వారంతా ఒకప్పుడు తినేందుకు తిండి లేక అలమటించిన వారే. సినిమా ఛాన్సుల కోసం చెన్నై, హైదరాబాద్,

ఖిలాడిలో 'చంద్రకళ'గా సిగ్గుపడుతోన్న అనసూయ.. ఎంత పద్ధతిగా వుందో..!!

టీవీ షోలు, ఈవెంట్స్‌తో పాటు సినిమాల్లోనూ ఛాన్స్‌లు దక్కించుకుని దూసుకెళ్తున్నారు స్టార్ యాంకర్ అనసూయ. యాంకరింగ్‌తో తనదైన గుర్తింపు తెచ్చుకున్న ఆమెకు సుకుమార్ లైఫ్ ఇచ్చారనే చెప్పుకోవచ్చు.

చావుకు భయపడను.. ‘‘జడ్’’ కేటగిరీ భద్రతను తిరస్కరించిన అసదుద్దీన్ ఒవైసీ

కేంద్ర ప్రభుత్వం తనకు కేటాయించిన జడ్‌ కేటగిరీ భద్రతను ఎంఐఎం అధినేత, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ తిరస్కరించారు. తనకు జడ్‌ కేటగిరీ భద్రత అక్కర్లేదన్న ఆయన. అందరిలాగే తాను