'SR కల్యాణమండపం' ట్రైలర్: ఎంటర్టైన్మెంట్, ఎమోషన్స్ బ్యాలన్స్ చేస్తూ..
Send us your feedback to audioarticles@vaarta.com
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఎస్ ఆర్ కల్యాణమండపం. ఆగష్టు 6న ఈ చిత్రం రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ థియేట్రికల్ ట్రైలర్ లాంచ్ చేసింది. వినోదం,భావోద్వేగాలు అన్ని అంశాలతో ట్రైలర్ ఆకట్టుకునేలా ఉంది.
సీనియర్ నటుడు సాయి కుమార్ ఈ చిత్రంలో వ్యసనపరుడిగా, హీరోకి తండ్రిగా నటించారు. హీరోయిన్ ప్రియాంక జవాల్కర్ బాగానే గ్లామర్ వెదజల్లనట్లు కనిపిస్తోంది. ఇక హీరో కిరణ్ పాత్రలో అన్ని ఎమోషనల్ ఉన్నాయి. యువకుడిగా ఫ్రెండ్స్ తో సరదాలు, హీరోయిన్ ని టీజ్ చేయడం లాంటి ఎంటర్టైనింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి .
'లక్షలకి లక్షలు కాండోనేషన్ కట్టి కాలేజీకి పంపితే చదువు నేర్పుతారేమో.. సంస్కారం కొంపలోనే నేర్పాలి.. నేర్పడికి కొంచెం' అంటూ కిరణ్ చెబుతున్న డైలాగ్ మాస్ కి చేరువయ్యేలా ఉంది. కిరణ్ యాటిట్యూడ్, మేనరిజమ్స్ మాస్ ప్రేక్షకులని టార్గెట్ చేసేవిధంగా ఉన్నాయి.
తండ్రి కొడుకులుగా సాయికుమార్, కిరణ్ మధ్య ఎమోషనల్ సీన్స్ బలంగా ఉన్నట్లు ఉన్నాయి. మొత్తంగా ఎస్ఆర్ కల్యాణమండపం ట్రైలర్ ఆకట్టుకునే విధంగా ఉంది.
శ్రీధర్ గాదె ఈ చిత్రానికి దర్శకుడు. చేతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు. ఎలైట్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ప్రమోద్, రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com