కిరణ్ అబ్బవరం నూతన చిత్రం ప్రారంభం
Send us your feedback to audioarticles@vaarta.com
రాజా వారు-రాణీగారు, ఎస్ఆర్ కల్యాణ మండపం చిత్రాలతో హీరోగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రామిసింగ్ కథానాయకుడు కిరణ్ అబ్బవరం హీరోగా సోమవారం హైదరాబాద్‌లో ఓ నూతన చిత్రం ప్రారంభమైంది. అగ్ర కథానాయకులతో, స్టార్ డైరక్టర్లతో సినిమాలు నిర్మిస్తూ అగ్ర నిర్మాణ సంస్థగా గుర్తింపు తెచ్చుకున్న మైత్రీ మూవీమేకర్స్, ఇటీవల మత్తు వదలరా వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాన్ని నిర్మించిన క్లాప్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
ప్రముఖ దర్శకులు కేఎస్ రవీంద్ర (బాబీ), గోపీచంద్ మలినేనిల వద్ద దర్శకత్వ శాఖలో పనిచేసిన రమేష్ కాదూరి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. పక్కా మాస్ కమర్షియల్ చిత్రంగా తెరకెక్కనున్న ఈ చిత్రానికి చిరంజీవి (చెర్రీ), హేమలత పెదమల్లు నిర్మాతలు. నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి సమర్పకులు. ముహుర్తపు సన్నివేశానికి యువ దర్శకుడు కేఎస్ రవీంద్ర (బాబి) కెమెరా స్వీచ్చాన్ చేయగా, ప్రముఖ దర్శకుడు కొరటాల శివ గారు క్లాప్ నిచ్చారు. మాస్ దర్శకుడు గోపీచంద్ మలినేని ముహుర్తపు సన్నివేశానికి దర్శకత్వం వహించారు. నిర్మాతలు నవీన్ ఎర్నేని, రవిశంకర్, చిరంజీవి (చెర్రీ)లు దర్శకుడికి స్క్రీప్ట్‌ను అందజేశారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments