హీరోయిన్‌ను పెళ్లి చేసుకోబోతున్న కిరణ్ అబ్బవరం.. ఎప్పుడంటే..?
Send us your feedback to audioarticles@vaarta.com
ఈ మధ్య తెలుగు హీరోలు ఒక్కొక్కరిగా పెళ్లీ పీటలు ఎక్కుతున్నారు. తాజాగతా మరో యంగ్ హీరో ఓ ఇంటివాడు అయ్యేందుకు రెడీ అయ్యారని ఫిల్మ్ నగర్ టాక్. హిట్, ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేసుకుంటూ వెళ్తున్న కిరణ్ అబ్బవరం.. తన పాత హీరోయిన్‌ను పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ నుంచి తొలుత యూట్యూబ్‌లో షార్ట్ ఫిల్మ్స్ తీసుకుంటూ ఉన్న కిరణ్ అబ్బవరం 'రాజావారు రాణిగారు' సినిమాతో సిల్వర్ స్క్రీన్ మీద హీరోగా నిలదొక్కుకున్నాడు. మొదటి చిత్రంతోనే ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకున్నాడు.
అయితే అప్పటి నుంచి ఈ చిత్రంలోని హీరోయిన్ రహస్య గోరక్‌తో కిరణ్.. రహస్య ప్రేమాయణం సాగిస్తున్నాడని రూమర్స్ వినిపిస్తూనే ఉన్నాయి. ఇక ఇప్పుడు వీరి బంధాన్ని అధికారికంగా ప్రకటించడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. అతి త్వరలోనే ఇద్దరు నిశ్చితార్థం చేసుకోనున్నట్లు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. కిరణ్, రహస్య గత ఐదేళ్లుగా ప్రేమించుకుంటూ రిలేషన్ షిప్‌లో ఉంటున్నారని చెబుతున్నారు. గతంలో ఓ షోలో రహస్య గురించి అడగగా తెగ సిగ్గుపడిపోయాడు. అంతకు ముందు కిరణ్ నూతన గృహ ప్రవేశ వేడుకల్లోనూ ఈ బ్యూటీ సందడి చేసింది. దీంతో వీరి బంధంపై పుకార్లు షికార్లు చేశాయి.
ఇక రహస్య రిలేషన్‌షిప్‌కి ఫుల్ స్టాప్ పెట్టాలని ఇద్దరు నిర్ణయించుకున్నట్లు చిత్ర వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ వారమే ఇరు కుటుంబాల పెద్దల సమక్షంలో వీరి ఎంగేజ్ మెంట్ జరగనుందట. త్వరలోనే దీనికి సంబంధించిన వివరాలు అధికారికంగా ప్రకటించనున్నారట. ఇదే నిజమైతే తన రీల్ లైప్ ఫస్ట్ హీరోయిన్‌నే రియల్ లైఫ్ వైఫ్‌గా చేసుకోనున్నాడు. నిశ్చితార్థం, పెళ్లికి సంబంధించిన తేదీలు, ఇతర వివరాలు కొన్ని రోజుల్లోనే వెల్లడించనున్నారట. దీంతో అభిమానులు కిరణ్‌కు ముందుగానే శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
ఇదిలా ఉంటే 'రాజావారు రాణిగారు' సినిమాతో హీరోగా పరిచయమైన కిరణ్ అబ్బవరం.. ఆ తర్వాత ఎస్‌ఆర్ కల్యాణ మండపం, వినరో విష్ణు భాగ్యము కథలతో మంచి హిట్స్ అందుకున్నాడు. దీంతో ఇండస్ట్రీలో యువ హీరోగా సెటిల్ అయ్యాడు. అయితే తర్వాత కథలు ఎంచుకోవడంలో తడబాటు చూపించడంతో వరుస ఫ్లాప్‌లు అందుకున్నాడు. మీటర్, రూల్స్ రంజన్ వంటి సినిమాలు డిజాస్టర్‌గా నిలిచాయి. ప్రస్తుతం 'దిల్ రూబా' సినిమాతో పాటు 1970వ దశకం నేపథ్యంతో సాగే ఓ పీరియాడిక్ మూవీ చేస్తున్నాడు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments