విశాఖపట్నంలో వైభవంగా 'కిరాక్ పార్టీ' సక్సెస్ సెలబ్రేషన్స్ !!
Send us your feedback to audioarticles@vaarta.com
నిఖిల్, సిమ్రాన్, సంయుక్త హెగ్డే హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం 'కిరాక్ పార్టీ'. శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఎ.కె.ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మించారు. మార్చి 16న విడుదలైన ఈ చిత్రం ఘన విజయం సొంతం చేసుకొంది.
అన్నీ వర్గాల ప్రేక్షకులు చిత్రాన్ని ఆదరించి ఉండడంతో.. చిత్ర బృందం సక్సెస్ టూర్ ని నిర్వహించింది. అందులో భాగంగా వైజాగ్ లో సక్సెస్ పార్టీ నిర్వహించింది. అక్కడ ఓ పబ్లిక్ ప్లేస్ లో నిర్వహించిన సక్సెస్ ఈవెంట్ కు వందల సంఖ్యలో స్టూడెంట్స్ హాజరయ్యారు. ఆ సందర్భంలో స్టూడెంట్స్ అందరితో క్వశ్చన్ & ఆన్సర్ సెషన్ నిర్వహించి, అందులో గెలుపొందినవారికి సెల్ఫీని ఇచ్చాడు హీరో నిఖిల్ & టీం.
ఈ సందర్భంగా నిఖిల్ మాట్లాడుతూ.. "థియేటర్ లో ప్రేక్షకులు విశేషంగా ఆదరిస్తున్నారు. ఫస్ట్ వీక్ లోనే బయ్యర్స్ అందరికీ బ్రేక్ ఈవెన్ తెచ్చిపెట్టిన చిత్రమిది. సెకండ్ వీక్ లో కూడా మంచి కలెక్షన్స్ తో ఆడుతోంది. స్టూడెంట్స్ మాత్రమే కాక అన్ని వర్గాల ప్రేక్షకులు ఆదరిస్తున్న సినిమా "కిరాక్ పార్టీ". నాకు ఇంత మంచి సినిమా ఇచ్చిన మా నిర్మాత అనిల్ సుంకరగారికి, డైరెక్టర్ శరణ్ కొప్పిశెట్టికి కృతజ్నతలు చెప్పుకొంటున్నాను. "హ్యాపీ డేస్ తర్వాత నేను నటించిన ప్యూర్ కాలేజ్ ఎంటర్ టైనర్ "కిరాక్ పార్టీ". సినిమా చూడనివాళ్లు ఈ చిత్రాన్ని చూడాలని కోరుకొంటున్నాను" అన్నారు.
కథానాయకి సిమ్రాన్ మాట్లాడుతూ.. "మా 'కిరాక్ పార్టీ' చిత్రాన్ని, ఆ చిత్రంలో నేను పోషించిన "మీరా" పాత్రను ఆదరిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. తెలుగులో నా పరిచయ చిత్రంతోనే ఇంతటి ఘన విజయం సొంతం చేసుకోవడం చాలా సంతోషం. వైజాగ్ లో క్రౌడ్ చూస్తుంటే షాకింగ్ గా ఉంది. నా డెబ్యూ మూవీకే ఈస్థాయిలో ప్రేక్షకులు ఆదరించడాన్ని ఎప్పటికీ మరువలేను" అన్నారు.
ఇంకా ఈ చిత్రంలో స్నేహితుల పాత్రల్లో నటించిన నటీనటులందరూ సక్సెస్ ఈవెంట్ కి విచ్చేసిన స్టూడెంట్స్ అందరితో సరదాగా గడిపు, ఆడిపాడి అందర్నీ ఉత్సాహపరిచారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments