నేరుగా ఓటిటిలో విడుదలవుతున్న ‘కిన్నెరసాని’ చిత్రం..
Send us your feedback to audioarticles@vaarta.com
సెన్సేషనల్ సినిమాలతో రోజురోజుకీ తన స్థాయి పెంచుకుంటుంది జీ 5 సంస్థ. ఇప్పటికే ఒరిజినల్ వెబ్ సిరీస్‌లతో పాటు ఆసక్తికరమైన సినిమాలను నేరుగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తుంది జీ5. తాజాగా మరో ఆసక్తికరమైన చిత్రాన్ని ఎక్స్‌క్లూజివ్‌గా జీ 5లో విడుదల చేయనున్నారు. కళ్యాణ్ దేవ్ హీరోగా నటించిన కిన్నెరసాని సినిమా హక్కులను జీ 5 సొంతం చేసుకున్నారు. జూన్ 10న ఈ సినిమాను నేరుగా ఓటిటిలో విడుదల చేయనున్నారు. మిస్టరీ థ్రిల్లర్‌గా తెరకెక్కిన కిన్నెరసాని జీ5లో నేరుగా ఆడియన్స్ ముందుకు రాబోతుంది.
వేద అనే అమ్మాయి.. తన తండ్రి కోసం వెతకడం చుట్టూనే ఈ సినిమా కథ అంతా తిరుగుతుంది. అన్ శీతల్, కాశిష్ ఖాన్ హీరోయిన్లుగా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రంలో రవీంద్ర విజయ్ విలన్‌గా నటించారు. మరో కీలక పాత్రలో మహతి బిక్షు నటించారు. రమణ తేజ ఈ థ్రిల్లర్‌ను ఆసక్తికరంగా తెరకెక్కించారు. సాయి తేజ దేహరాజ్ ఆత్రేయస ఈ సినిమాకు కథ అందించారు. ఈ సినిమా కచ్చితంగా ప్రేక్షకులను మెప్పిస్తుందని మేకర్స్ బలంగా చెప్తున్నారు.
నటీనటులు: కళ్యాణ్ దేవ్, అన్ శీతల్, కాశిష్ ఖాన్,. రవీంద్ర విజయ్, మహతి బిక్షు తదితరులు
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments