బంగార్రాజు టీజర్ : నాగ్, చైతూ కుమ్మేశారుగా.. సంక్రాంతికి విందు భోజనమే..!!
Send us your feedback to audioarticles@vaarta.com
కింగ్ నాగార్జున, రమ్యకృష్ణ కలసి నటించిన ‘‘ సోగ్గాడే చిన్నినాయన’’కు సీక్వెల్‌గా తెరకెక్కుతోన్న చిత్రం బంగార్రాజు . ఈసారి నాగచైతన్య, కృతి శెట్టిలు కూడా బంగార్రాజుతో కలిసి సందడి చేయనున్నారు. రావు రమేష్, బ్రహ్మాజీ, 'వెన్నెల' కిషోర్, ఝాన్సీ, అనితా చౌదరి, రోహిణీ, ప్రవీణ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. అన్నపూర్ణ స్టూడియోస్ ప్రై. లి., జీ స్టూడియోస్ బ్యానర్లపై నాగార్జున ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
న్యూఇయర్ సందర్భంగా ‘‘బంగార్రాజు’’ టీజర్‌ను రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. టీజర్ విషయానికి వస్తే... సొగ్గాడే చిన్ని నాయన మాదిరిగానే ఇందులోనూ నాగార్జున మరోసారి ఆత్మగా కనిపించారు. సోగ్గాడిగా నాగార్జున స్టయిల్‌ను నాగ చైతన్య బాగా పట్టుకున్నారు. ఇంట్లో నుంచి బయటకు వచ్చేటప్పుడు ఆయన లుక్, గెటప్ అదిరింది. నాగార్జున నడుమును రమ్యకృష్ణ గిల్లగా... 'ఊరుకోవే పుటుకీ, కితకితలు పెడుతున్నాయి' అని అనడం ఆకట్టుకుంది.
ఇక సర్పంచ్ పదవికి పోటీ చేస్తున్న అమ్మాయిగా కృతీ శెట్టి కనిపించింది. 'నువ్వు ఈ ఊరికే సర్పంచ్ కాదు... మన రాష్ట్రానికి సర్పంచ్‌వి కావాలి. దేశానికి సర్పంచ్‌వి కావాలి' అంటూ అల్లరి చేసే కుర్రాడిగా చైతూ నటన బాగుంది. టీజర్ చివరిలో నాగ్, చైతన్య ఫైట్లు బాగున్నాయి. మెగా బ్రదర్ నాగబాబు మరోసారి యముడిగా అలరించారు. మరి తండ్రి కొడుకులు ఎలా చేశారో.. ఎంత వినోదం పంచారో తెలియాలంటే సంక్రాంతి వరకు ఎదురుచూడాల్సిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com