ఫిబ్రవరి నెలాఖరున సత్తారు సెట్‌కి కింగ్
Send us your feedback to audioarticles@vaarta.com
‘గరుడవేగ’ సినిమాతో దర్శకుడిగా ప్రవీణ్ సత్తారు సత్తా ఏమిటో ఇండస్ట్రీకి తెలిసింది. సెన్సిబుల్ సినిమా ‘చందమామ కథలు’ తీసిన వ్యక్తిలో ఇంత విషయం ఉందా? అనుకున్నారంతా! ‘గుంటారు టాకీస్’ లాంటి బోల్డ్ కాన్సెప్ట్ ఫిల్మ్ తీసిన దర్శకుడు ‘గరుడవేగ’ తీశాడా? అని ఆశ్చర్యపోయారు ఇంకొందరు. ‘గరుడవేగ’తో ఎటువంటి సినిమా అయినా తీయగలడనే పేరు ప్రవీణ్ సత్తారుకు వచ్చింది. అలాగే, టాప్ స్టార్ల దృష్టిలో పడ్డాడు. కింగ్ నాగార్జునతో సినిమా చేసే ఛాన్స్ అందుకున్నాడు.
మన్మథుడు నాగార్జునతో ప్రవీణ్ సత్తారు ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఫిబ్రవరి నెలాఖరున ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ కానుందని తెలిసింది. యాక్చువల్లీ, లాస్ట్ ఇయర్ జూలైలో ఈ సినిమా అనౌన్స్ చేశారు. కరోనా సిచ్యువేషన్స్ వల్ల స్టార్ట్ చేయడం కుదరలేదు. షూటింగ్స్ స్టార్ట్ అయ్యాక నాగార్జున ‘వైల్డ్ డాగ్’ కంప్లీట్ చేశారు. మొత్తం మీద ఇప్పటికి సెట్స్ మీదకు వెళ్లడానికి ముహూర్తం కుదిరింది. ఫిబ్రవరి నెలాఖరున రెండు మూడు రోజులు హైదరాబాద్‌లో షూటింగ్ చేసి, ఆ తర్వాత ఊటీ వెళ్లేలా ప్లాన్ చేశారు. అక్కడ రెండు మూడు వారాలు ఉంటుందట. యూనిట్ ప్లాన్‌లో లండన్ షెడ్యూల్ ఒకటి ఉంది. మధ్య మధ్యలో హైదరాబాద్‌లో షూటింగ్స్ ప్లాన్ చేశారు. నాగార్జున పక్కన హీరోయిన్, ఇతర కాస్ట్ అండ్ క్రూ ఫైనలైజ్ చేసే పనిలో ప్రవీణ్ సత్తారు బిజీ బిజీగా ఉన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments