కొత్త కొత్త భాష అంటూ కింగ్ రాకింగ్
Send us your feedback to audioarticles@vaarta.com
కింగ్ అక్కినేని నాగార్జున సమర్పణలో హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్‌ను హీరోగా పరిచయం చేస్తూ రూపొందిస్తున్న చిత్రం నిర్మలా కాన్వెంట్. జై చిరంజీవ, దూకుడు, రోబో చిత్రాల్లో బాలనటిగా నటించిన శ్రేయాశర్మ ఈ చిత్రంలో రోషన్ సరసన హీరోయిన్‌గా నటించింది. యూత్‌ఫుల్ లవ్ ఎంటర్‌టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం ద్వారా జి.నాగకోటేశ్వరరావు దర్శకుడుగా పరిచయమవుతున్నారు. మ్యాట్రిక్స్ టీమ్ వర్క్స్‌తో కలిసి అన్నపూర్ణ స్టూడియోస్ ఈ చిత్రాన్ని నిర్మించింది. ఫ్రెష్ ఫ్యూర్ లవ్ స్టోరీ గా రూపొందుతున్న ఈ చిత్రంలో నాగార్జున స్పెషల్ రోల్ ఈ మూవీకి హైలెట్ గా నిలుస్తుందని సమాచారం.
ఇదిలా ఉంటే... ఈ చిత్రంలో నాగార్జున స్పెషల్ రోల్ చేయడంతో పాటు ఓ పాట కూడా పాడడం విశేషం. కొత్త కొత్త భాష కొత్త ప్రేమ భాష...నీకు నాకు మధ్య...అక్షరాలు లేవు డిక్షనరీలులేవు... గ్రామరైనా లేదే...నీ నా కన్నుల్లోనా నీ నా నవ్వుల్లోనా...మౌనం మ్రోగించే భాష అంటూ నవ మన్మధుడు ప్రేమ గీతాన్ని అద్భుతంగా పాడారు. ఈ పాటను నాగార్జున ట్విట్టర్ ద్వారా రిలీజ్ చేసారు. ఈ చిత్రంలో నాగార్జున క్యారెక్టర్ తో పాటు నాగ్ పాడిన ఈ పాట కూడా హైలెట్ నిలుస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.ఈ పాటను అనంత శ్రీరామ్ రాయగా...రోషన్ సాలూరు సంగీతం అందించారు. క్రిమినల్, సీతారామరాజు, శిరిడి సాయి చిత్రాల్లో పాట పాడిన నాగార్జున మళ్లీ ఇప్పుడు నిర్మలా కాన్వెంట్ కోసం పాట పాడడం విశేషం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments