కొత్త కొత్త భాష అంటూ కింగ్ రాకింగ్

  • IndiaGlitz, [Saturday,July 23 2016]

కింగ్ అక్కినేని నాగార్జున సమర్పణలో హీరో శ్రీకాంత్‌ తనయుడు రోషన్‌ను హీరోగా పరిచయం చేస్తూ రూపొందిస్తున్న చిత్రం నిర్మ‌లా కాన్వెంట్. జై చిరంజీవ, దూకుడు, రోబో చిత్రాల్లో బాలనటిగా నటించిన శ్రేయాశర్మ ఈ చిత్రంలో రోషన్‌ సరసన హీరోయిన్‌గా నటించింది. యూత్‌ఫుల్‌ లవ్‌ ఎంటర్‌టైనర్ గా తెర‌కెక్కుతున్న‌ ఈ చిత్రం ద్వారా జి.నాగకోటేశ్వరరావు దర్శకుడుగా పరిచయమవుతున్నారు. మ్యాట్రిక్స్‌ టీమ్‌ వర్క్స్‌తో కలిసి అన్నపూర్ణ స్టూడియోస్ ఈ చిత్రాన్ని నిర్మించింది. ఫ్రెష్ ఫ్యూర్ ల‌వ్ స్టోరీ గా రూపొందుతున్న ఈ చిత్రంలో నాగార్జున స్పెష‌ల్ రోల్ ఈ మూవీకి హైలెట్ గా నిలుస్తుంద‌ని స‌మాచారం.

ఇదిలా ఉంటే... ఈ చిత్రంలో నాగార్జున స్పెషల్ రోల్ చేయ‌డంతో పాటు ఓ పాట కూడా పాడ‌డం విశేషం. కొత్త కొత్త భాష కొత్త ప్రేమ భాష...నీకు నాకు మ‌ధ్య‌...అక్ష‌రాలు లేవు డిక్ష‌న‌రీలులేవు... గ్రామ‌రైనా లేదే...నీ నా క‌న్నుల్లోనా నీ నా న‌వ్వుల్లోనా...మౌనం మ్రోగించే భాష అంటూ న‌వ మ‌న్మ‌ధుడు ప్రేమ గీతాన్ని అద్భుతంగా పాడారు. ఈ పాట‌ను నాగార్జున ట్విట్ట‌ర్ ద్వారా రిలీజ్ చేసారు. ఈ చిత్రంలో నాగార్జున క్యారెక్ట‌ర్ తో పాటు నాగ్ పాడిన ఈ పాట కూడా హైలెట్ నిలుస్తుంది అన‌డంలో ఎలాంటి సందేహం లేదు.ఈ పాట‌ను అనంత శ్రీరామ్ రాయ‌గా...రోష‌న్ సాలూరు సంగీతం అందించారు. క్రిమినల్, సీతారామ‌రాజు, శిరిడి సాయి చిత్రాల్లో పాట పాడిన నాగార్జున‌ మ‌ళ్లీ ఇప్పుడు నిర్మలా కాన్వెంట్ కోసం పాట పాడ‌డం విశేషం.

More News

ఆ నలుగురు లో నేనున్నాను అని తెలిసినప్పుడు నా ఫీలింగ్ అదే - డి.సురేష్ బాబు

విజయ్ దేవరకొండ,రీతువర్మ,నందు ప్రధాన పాత్రల్లో నూతన దర్శకుడు తరుణ్ భాస్కర్ తెరకెక్కించిన చిత్రం పెళ్లి చూపులు.

చిన్న నిర్మాత‌లు ఇబ్బంది ప‌డుతున్నారు - ఎస్.కె.బ‌షీద్

ఎక్స్‌వైజడ్ చిత్రం ఉభయ తెలుగు రాష్ర్టాల్లో చక్కటి వసూళ్లను సాధిస్తోంది అని తెలిపారు ఎస్.కె. బషీద్. ఆయన స్వీయ దర్శకత్వంలో నూతన తారాగణంతో రూపొందించిన చిత్రం ఎక్స్‌వైజడ్. ఇటీవలే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చింది.

ప‌వ‌న్ మూవీకి ముహుర్తం ఖ‌రారు

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ హీరోగా గోపాల గోపాల ఫేమ్ డాలీ ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం రూపొందుతుంది. ఈ చిత్రాన్ని ప‌వ‌న్ ఫ్రెండ్ శ‌ర‌త్ మ‌రార్ నార్త్ స్టార్ ఎంట‌ర్ టైన్మెంట్ బ్యాన‌ర్ పై నిర్మిస్తున్నారు.

మ‌న‌మంతా ధియేట్రిక‌ల్ ట్రైల‌ర్ రివ్యూ..

మ‌ల‌యాళ సూప‌ర్ స్టార్ మోహ‌న్ లాల్, గౌత‌మి, కేరింత ఫేం విశ్వంత్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో చంద్ర‌శేఖ‌ర్ ఏలేటి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన విభిన్న‌క‌థా చిత్రం మ‌నమంతా. ఈ చిత్రాన్ని వారాహి చ‌ల‌న‌చిత్ర బ్యాన‌ర్ పై సాయి కొర్ర‌పాటి నిర్మించారు.

మనుషుల్లో దేవుడు అంటే ఇతనే...

గ్రూప్ డాన్సర్ గా కెరీర్ ప్రారంభించి...కొరియోగ్రాఫర్ గా,కథానాయకుడు గా,దర్శకుడుగా,సంగీత దర్శకుడిగా...