Bigg Boss 7 Telugu : సెకండ్ హౌస్‌మేట్‌గా శివాజీ .. రూల్స్ ప్రకారం ఆడాలన్న నాగ్, కంటెస్టెంట్స్‌కి రేటింగ్
Send us your feedback to audioarticles@vaarta.com
చూస్తూ వుండగానే బిగ్‌బాస్ 7 తెలుగు సెకండ్ వీకెండ్‌కు వచ్చేసింది. ఉల్టా పల్టా అంటూ సీజన్‌ను రక్తి కట్టించేందుకు బిగ్‌బాస్ తీవ్రంగా శ్రమిస్తున్నాడు. గొడవలు, టాస్క్‌లతో ఇప్పుడిప్పుడే షో ఆసక్తికరంగా మారుతోంది. పవర్ అస్త్ర, మాయ అస్త్ర అంటూ పెట్టిన టాస్క్‌లు బాగానే వర్కవుట్ అవుతున్నాయి. ఇక ప్రిన్స్ యావర్ తనకు హౌస్‌లో వుండటం నచ్చడం లేదని, ఇక్కడ అంతా ఫేక్ మనుషులే వున్నారంటూ ఇంగ్లీష్, హిందీల్లో కంటెస్టెంట్స్ మీద విరుచుకుపడ్డాడు. ఇవాళ్టీ ఎపిసోడ్‌లో ప్రిన్స్ మరోసారి హైలైట్ అయ్యేందుకు ప్రయత్నించాడు.
మాయాస్త్ర విషయంలో తనకు రతిక సపోర్ట్ చేయడంతో ఆమెకు ధన్యవాదాలు తెలిపాడు.. తనపై నాకు గౌరవం పెరిగిందని చెప్పాడు. అంతలోనే శుభశ్రీతో మాట్లాడుతూ.. నాకు అన్యాయం జరిగింది.. హౌస్‌లో డర్టీ పాలిటిక్స్ జరుగుతున్నాయంటూ వంకలు పెట్టాడు. వ్యవహారం ఇలాగే కొనసాగితే బాగోదని భావించిన షకీలా పెద్ద మనిషిలా వ్యవహరించింది. ప్రిన్స్- గౌతమ్ మధ్య రాజీ కుదిర్చింది. దీంతో హౌస్ మేట్స్ ఊపిరి పీల్చుకున్నారు.
ఇక శనివారం కావడంతో హోస్ట్ నాగార్జున ఎంట్రీ ఇచ్చారు. కంటెస్టెంట్స్ ఎలా చేశారో గతవారం ప్రేక్షకులు చెప్పారని, ఈసారి మాత్రం తానే అనౌన్స్ చేస్తానని నాగ్ వెల్లడించారు. ఒక్కొక్కరు ఎక్కడ తప్పులు చేశారో చెబుతూ.. చురకలంటిస్తూ, ప్రశంసలు కురిపిస్తూ వచ్చారు నాగ్. అలాగే సందీప్ తర్వాత సెకండ్ పవర్ అస్త్రాను ఎవరు దక్కించుకున్నారనే ఉత్కంఠకు నాగ్ తెరదించారు. సెకండ్ హౌస్‌మేట్‌గా శివాజీని ప్రకటించారు. పవర్ అస్త్రను దక్కించుకోవడంతో పాటు నాలుగు వారాల ఇమ్యూనిటీని పొందాడు శివాజీ. టాస్క్ సమయంలో రణధీర టీమ్‌ను లీడ్ చేసిన విధానం బాగుందని కాంప్లిమెంట్ ఇచ్చారు. అయితే ఇక్కడే హోస్ట్‌గా తన కర్తవ్యాన్ని నిర్వర్తించారు నాగ్. మాట్లాడితే.. తలుపు తెరవండి, నేను వెళ్లిపోతానంటూ శివాజీ చేస్తున్న కామెంట్స్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్కసారి హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చాక బిగ్‌బాస్ రూల్స్‌ను మాత్రమే ఫాలో అవ్వాలని చెప్పాడు.
ఇకపోతే.. ఈవారం కంటెస్టెంట్ల ఆటతీరును కింగ్స్ మీటర్ ద్వారా బిగ్‌బాసే నిర్ణయించారు. ఒక్కొక్కరికి రెడ్, ఎల్లో, గ్రీన్ కలర్స్‌తో రేటింగ్ ఇచ్చారు. శుభశ్రీ, దామిని, శోభా శెట్టి, రతిక, ప్రిన్స్, అమర్‌దీప్‌ల ఆటతీరు బాగుందన్నారు. రైతుబిడ్డ ప్రశాంత్ తెచ్చిన మిర్చి మొక్క ఎండిపోవడం ఏంటని బిగ్‌బాస్ ప్రశ్నించాడు. మొక్కను సరిగా చూసుకోలేనప్పుడు రైతు బిడ్డ ఎలా అవుతారని ప్రశ్నించాడు. హౌస్‌లో ఎప్పుడూ నిద్రపోతూ కనిపించడంపై టేస్టీ తేజాపై ఆగ్రహం వ్యక్తం చేశారు బిగ్‌బాస్.
మరోవైపు.. ఈ వారం నామినేషన్స్‌లో వున్న అమర్‌దీప్, శివాజీ, ఆట సందీప్, ప్రియాంక, శుభశ్రీ, దామినిలు సేఫ్ సైడ్ వున్నారని బిగ్‌బాస్ ప్రకటించారు. షకీలా, ప్రశాంత్, గౌతమ్, ప్రిన్స్, తేజా, శోభాశెట్టి, రతికలు నామినేషన్స్‌లో వున్నారు. వీరిలో సెకండ్ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారో తెలియాలంటే కొద్దిగంటలు వెయిట్ చేయాల్సిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com