ఒకే చిత్రంలో కింగ్ నాగ్ & విక్టరీ వెంకీ నటిస్తున్నారు..!
Friday, August 26, 2016 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
కింగ్ నాగ్ & విక్టరీ వెంకీ మధ్య ఉన్న అనుబంధం గురించి అందరికీ తెలిసిందే. కానీ...ఇప్పటి వరకు ఇద్దరూ కలిసి ఒక సినిమా కూడా చేయలేదు. అయితే...ఇప్పుడు ఇద్దరూ ఒకే చిత్రంలో నటిస్తున్నారు. అదే చైతు ప్రేమమ్. ఈ చిత్రాన్ని కార్తికేయ ఫేమ్ చందు మొండేటి తెరకెక్కిస్తున్నారు. సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ చిత్రాన్ని సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. మలయాళంలో సంచలన విజయం సాధించిన ప్రేమమ్ చిత్రాన్ని అదే టైటిల్ తో రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే.
ఈ చిత్రంలో విక్టరీ వెంకటేష్ గెస్ట్ రోల్ చేస్తున్నారు. వెంకీ, చైతు లపై వచ్చే సన్నివేశాలను ఆల్రెడీ చిత్రీకరించారు. వెంకటేష్ తో పాటు నాగార్జున కూడా ఈ చిత్రంలో గెస్ట్ రోల్ చేస్తుండడం విశేషం. నిన్న నాగార్జున, చైతన్య ల పై వచ్చే సీన్స్ ను చిత్రీకరించారు. నాగార్జున పుట్టినరోజు నాడు ఈ చిత్రంలోని ఎవరే సాంగ్ వీడియోను, అక్కినేని జయంతి రోజున ఆడియోను రిలీజ్ చేయనున్నారు. దసరా కానుకగా ప్రేమమ్ చిత్రాన్ని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రంలో నాగ్ & వెంకీ గెస్ట్ రోల్స్ చేయడంతో ప్రేమమ్ కి మరింత క్రేజ్ ఏర్పడింది. దసరాకి నాగ్ ఫ్యాన్స్ కి పండగే పండగ..!
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments