దాసరి ఆరోగ్యం నిలకడగా ఉంది - కిమ్స్ వైద్యులు
Send us your feedback to audioarticles@vaarta.com
టాలీవుడ్ దర్శక గురువు దర్శకరత్న డా.దాసరినారాయణరావు ఆరోగ్యంపై ఆందోళనకర పరిస్థితి నెలకొంది. ఆనారోగ్యం కారణంగా కొన్ని నెలల క్రితం కిమ్స్‌లో చేరి దాసరికి అన్నవాహిక ఆపరేషన్ చేశారు. కొన్ని నెలలు పాటు హాస్పిటల్‌లోనే ఉన్న దాసరి మార్చి 29న ఇంటికి చేరుకున్నారు. తన 75వ పుట్టినరోజును సెలబ్రేట్ కూడా చేసుకున్నారు.
అయితే దాసరి ఆరోగ్యం తిరగబెట్టడంతో ఆయన్ను మే 17న మళ్ళీ కిమ్స్‌లో జాయిన్ చేశారు. ఈ రోజు సాయంత్రం దాసరి ఆరోగ్యం ఆందోళనకరంగా ఉందంటూ వార్తలు వచ్చాయి. దీంతో టాలీవుడ్ మీడియా అంతా కిమ్స్ దగ్గరకు చేరారు. అయితే లెటెస్ట్‌గా కిమ్స్ వైద్యుల సమాచారం ప్రకారం దాసరి ఆరోగ్యం నిలకడగా ఉందని, దాసరిని ఐసియూలో ఉంచి హిమో డయాలసిస్‌ను చేస్తున్నామని ప్రకటించారు. ఈ వార్త ఆయన అభిమానులకు, శ్రేయోభిలాషులకు ఊరటనిచ్చేదే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com