దాసరి ఆరోగ్యం నిలకడగా ఉంది - కిమ్స్ వైద్యులు

  • IndiaGlitz, [Tuesday,May 30 2017]

టాలీవుడ్ ద‌ర్శ‌క గురువు ద‌ర్శ‌కర‌త్న డా.దాస‌రినారాయ‌ణ‌రావు ఆరోగ్యంపై ఆందోళ‌న‌క‌ర ప‌రిస్థితి నెల‌కొంది. ఆనారోగ్యం కార‌ణంగా కొన్ని నెల‌ల క్రితం కిమ్స్‌లో చేరి దాస‌రికి అన్న‌వాహిక ఆప‌రేష‌న్ చేశారు. కొన్ని నెల‌లు పాటు హాస్పిట‌ల్‌లోనే ఉన్న దాస‌రి మార్చి 29న ఇంటికి చేరుకున్నారు. త‌న 75వ పుట్టిన‌రోజును సెల‌బ్రేట్ కూడా చేసుకున్నారు.

అయితే దాస‌రి ఆరోగ్యం తిర‌గ‌బెట్ట‌డంతో ఆయ‌న్ను మే 17న మ‌ళ్ళీ కిమ్స్‌లో జాయిన్ చేశారు. ఈ రోజు సాయంత్రం దాస‌రి ఆరోగ్యం ఆందోళ‌నక‌రంగా ఉందంటూ వార్త‌లు వ‌చ్చాయి. దీంతో టాలీవుడ్ మీడియా అంతా కిమ్స్ ద‌గ్గ‌ర‌కు చేరారు. అయితే లెటెస్ట్‌గా కిమ్స్ వైద్యుల స‌మాచారం ప్ర‌కారం దాసరి ఆరోగ్యం నిల‌క‌డ‌గా ఉందని, దాస‌రిని ఐసియూలో ఉంచి హిమో డ‌యాల‌సిస్‌ను చేస్తున్నామ‌ని ప్ర‌క‌టించారు. ఈ వార్త ఆయ‌న అభిమానుల‌కు, శ్రేయోభిలాషులకు ఊర‌ట‌నిచ్చేదే.

More News

ఈ మధ్య కాలంలో విన్న సబ్జెక్ట్స్ లో ఎగ్జయిట్ మెంట్ తో చేసిన సినిమా 'అంధగాడు' - రాజ్ తరుణ్

ఏ టీవీ సమర్పణలో ప్రముఖ నిర్మాణ సంస్థ ఎ.కె.ఎంటర్టైన్మెంట్స్ ఇండియా ప్రై.లి. బ్యానర్లో రాజ్తరుణ్ హీరోగా ఈడోరకం-ఆడోరకం, కిట్టు ఉన్నాడు జాగ్రత్త వంటి సూపర్హిట్ చిత్రాలు తర్వాత యువ కథానాయకుడు రాజ్తరుణ్ హీరోగారూపొందుతోన్న హ్యాట్రిక్ మూవీ `అంధగాడు`.

ఎవరూ క్లాసిక్ మూవీస్ ను ముందుగా ప్లాన్ చేసుకోలేరు - మధుర శ్రీధర్ రెడ్డి

స్నేహగీతం సినిమాతో దర్శకుడిగా తెరంగేట్రం చేసిన మధుర శ్రీధర్ రెడ్డి , ఇట్స్ మై లవ్స్టోరీ, బ్యాక్బెంచ్ స్టూడెంట్స్ సినిమాలకు దర్శకత్వం వహించిన తర్వాత నిర్మాతగా మారారు.

సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్, బివిఎస్ రవి, కృష్ణ 'జవాన్' చిత్రం టాకీ పార్ట్ పూర్తి

సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్, మెహ్రీన్ ఫిర్జాదా జంటగా బివిఎస్ రవి దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న చిత్రం జవాన్. ప్రముఖ నిర్మాత దిల్ రాజు సమర్పణలో అరుణాచల్ క్రియేషన్స్ బ్యానర్ పై కృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

అదర గొడుతున్న దువ్వాడ

స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ డిజె దువ్వాడ జగన్నాథమ్గా జూన్ 23న సందడి చేయనున్నాడు. ఈలోపు యూనిట్ ప్రమోషన్ వర్క్స్లో బిజీగా ఉంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన పాటల్లో ఒక్కొక్క పాటను మార్కెట్లోకి విడుదల చేస్తున్నారు.

జి.ఎస్.టి. వల్ల తెలుగు సినిమాకు నష్టం జరుగుతుంది...తెలంగాణ ఫిల్మ్ చాంబర్ చైర్మన్ ఆర్.కె.గౌడ్

తెలుగు సినిమా పరిశ్రమకి ఎటువంటి నష్టం కలిగిన నేనున్నానంటు స్పందించే తెలంగాణ ఫిల్మ్ చాంబర్ చైర్మన్ ప్రతాని రామక్రిష్ణ గౌడ్ ఇటీవల కేంద్ర ఆర్థిక శాఖమంత్రి సినిమా వినోదపు పన్ను పెంచుటను నిరసిస్థూ విలేకరుల సమావేశం ఎర్పాటు చేయడం జరిగింది