కిమ్.. మీరు బాగుండాలి.. : ట్రంప్
Send us your feedback to audioarticles@vaarta.com
ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ (36)కు తీవ్ర అస్వస్థతకు లోనయ్యారని.. పరిస్థితి ఆందోళనకరంగా ఉందంటూ అమెరికా మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే కిమ్‌కు గుండె సంబంధ ఆపరేషన్ జరిగినట్లు.. సర్జరీ తర్వాత కిమ్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. అతిగా స్మోకింగ్ చేయడం.. లావు ఎక్కువగా ఉండటంతో ఒబెసిటితో కిమ్ తీవ్రంగా ఇబ్బంది పడుతున్నట్లు వార్తలొచ్చాయ్. అయితే ఈ వార్తలు వచ్చి 48 గంటలు గడిచినప్పటికీ ఇంతవరకూ ఆ దేశం నుంచి చిన్నపాటి రియాక్షన్ కూడా లేదు. దీంతో అసలు ఉత్తర కొరియాలో అసలేం జరుగుతోందో..? అసలు ఆయన ఆరోగ్యంపై ఎందుకింత గోప్యం..? అనేది తెలియరాలేదు. మరోవైపు.. ఇలాంటి తరుణంలో అమెరికా నిఘా వర్గాలు రంగంలోకి దిగి పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నాయని కూడా వార్తలు వినిపించాయి.
మీరు బాగుండాలి..!
ఈ వ్యవహారంపై తాజాగా అ్రగరాజ్యం అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ స్పందించారు. ఇవాళ వైట్ హౌస్‌లో మీడియాతో మాట్లాడారు. కిమ్‌తో నాకు చాలా సత్సంబంధాలు ఉన్నాయి.. ఆయన బాగుండాలని ఆకాంక్షించారు. కిమ్ పరిస్థితి విషమంగా ఉందన్న వార్తలపై ఎవరూ స్పందించడం కానీ.. ధృవీకరించడం లేదన్నారు. కాగా.. సౌత్ కొరియా అంటే అమెరికాకు పడదన్న విషయం తెలిసిందే. ఇవి రెండు బద్ధ శత్రువులు. అయితే ట్రంప్ ఇలా మాట్లాడటం వెనుక ఏదో ఒక మతలబు ఉంటుందనే అభిప్రాయాలు వెలువడుతున్నాయి. కిమ్ ఆరోగ్యంపై రోజురోజుకు ఇలా వార్తలు వస్తుండటంతో అసలేం జరుగుతోందో తెలియని పరిస్థితి నెలకొంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout