అప్పట్లో స్టార్ క్రికెటర్ తో.. ఇప్పుడు టెన్నిస్ స్టార్ తో.. ఐటం బ్యూటీ ఎఫైర్
Send us your feedback to audioarticles@vaarta.com
హాట్ బ్యూటీ కిమ్ శర్మ తన కెరీర్ మొత్తం వ్యక్తిగత విషయాలతో వార్తల్లో నిలుస్తూనే వచ్చింది. తన గ్లామర్ తో వెండితెరని వేడెక్కించిన కిమ్ శర్మ కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటోంది.అయినప్పటికీ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన ఉనికి చాటుకుంటోంది.
కిమ్ శర్మ ఎప్పుడూ తన ప్రేమ వ్యవహారాలతో వార్తల్లో ఉండడం చూస్తూనే ఉన్నాం. గతంలో పలువురితో ఎఫైర్స్ సాగించినప్పటికీ వారితో బ్రేకప్ చేసుకుంది కిమ్ శర్మ. తాజాగా మరోమారు వార్తల్లో నిలిచింది. కిమ్ శర్మ ప్రస్తుతం టెన్నిస్ స్టార్ లియాండర్ పేస్ తో డేటింగ్ చేస్తున్నట్లు స్పష్టంగా అర్థం అవుతోంది.
వీరిద్దరూ గోవా వెకేషన్ లో ఎంజాయ్ చేస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. వారిద్దరూ కలసి ఉంటున్న పిక్స్ ని ఓ రెస్టారెంట్ తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. లియాండర్ పేస్.. కిమ్ శర్మని వెనుక నుంచి హగ్ చేసుకుని ఉన్న పిక్..ఆమెతో డిన్నర్ చేస్తున్న ఫోటోలు వైరల్ గా మారాయి.
48 ఏళ్ల లియాండర్ పేస్ గతంలో మోడల్ రియా పిళ్ళైతో సహజీవనం చేశాడు.ఈ జంటకు ఓ కుమార్తె కూడా ఉంది. ఆ తర్వాత వీరిద్దరూ విడిపోయిన సంగతి తెలిసిందే. ఇక కిమ్ శర్మ కెరీర్ ఆరంభంలో స్టార్ క్రికెటర్ యువరాజ్ తో ఎఫైర్ సాగించినట్లు ప్రచారం జరిగింది. ఆ తర్వాత నటుడు హర్షవర్ధన్ రానేతో కూడా సహజీవనం చేసింది. ఆమె విషయంలో ఏ రిలేషన్ షిప్ వర్కౌట్ కాలేదు. ప్రస్తుతం లియాండర్ పేస్ తో డేటింగ్ చేస్తుండడం హాట్ టాపిక్ గా మారింది.
కిమ్ శర్మ బాలీవుడ్ లో అనేక చిత్రాల్లో నటించింది. తెలుగులో మగధీర, ఆంజనేయులు చిత్రాల్లో స్పెషల్ సాంగ్స్ చేసిన సంగతి తెలిసిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com