వర్మ రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది...

  • IndiaGlitz, [Thursday,December 03 2015]

సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రామ్‌గోపాల్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన చిత్రం కిల్లింగ్ వీర‌ప్ప‌న్' విడుద‌ల‌కు ముందు స‌మ‌స్య‌ల‌ను ఫేస్ చేసింది. నిర్మాత‌లు ఈ సినిమాను డిసెంబ‌ర్ 4న విడుద‌ల చేద్దామ‌ని అనుకున్నారు. అయితే వీర‌ప్ప‌న్ భార్య ముత్తుల‌క్ష్మి త‌న‌కు సినిమా ముందు చూపించాల‌ని చెప్ప‌డ‌మే కాకుండా కోర్టు నుండి సినిమా ఆపేయ‌మ‌ని ఆర్డ‌ర్స్ తెచ్చుకోవ‌డంతో సినిమా డిసెంబ‌ర్ 4న విడుద‌ల కాకుండా ఆగిపోయింది. కోర్టు వ్య‌వ‌హరం ఎందుక‌నుకున్నాడో ఏమో కానీ వ‌ర్మ వీర‌ప్ప‌న్ భార్య ముత్తుల‌క్ష్మిని క‌లిసి స‌మ‌స్య‌ను సామ‌ర‌స్యంగా ప‌రిష్క‌రించుకున్నాడ‌ట‌. ఈ విషయం గురించి తన ట్విట్ట‌ర్ అకౌంట్ ద్వారా తెలియ‌జేస్తూ సినిమా డిసెంబ‌ర్ 11న విడుద‌ల‌వుతుందని చెప్పుకొచ్చాడు.