న‌వంబ‌ర్ 6న కిల్లింగ్ వీర‌ప్ప‌న్‌

  • IndiaGlitz, [Friday,September 18 2015]

గంధ‌పుచెక్క‌ల స్మ‌గ్ల‌ర్ వీర‌ప్ప‌న్ జీవిత చ‌రిత్ర‌తో తెర‌కెక్కుతున్న సినిమా కిల్లింగ్ వీర‌ప్ప‌న్‌. రామ్ గోపాల్ వ‌ర్మ ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. క‌న్న‌డ న‌టుడు శివ‌రాజ్ కుమార్ ఇందులో సెందామ‌రై క‌ణ్ణ‌న్ అనే పాత్ర‌లో న‌టిస్తున్నారు.

వీర‌ప్ప‌న్ ను కాల్చి చంపిన పోలీసే సెందామ‌రై క‌ణ్ణ‌న్‌. య‌జ్ఞ శెట్టి, పారుల్ యాద‌వ్ నాయిక‌లు. సందీప్‌భ‌ర‌ద్వాజ్ వీర‌ప్ప‌న్ పాత్ర‌లో న‌టిస్తున్నారు. బి.వి.మంజునాథ్‌, బి.ఎస్‌.సుధీంద్ర‌, ఇ.ఝ‌శివ‌ప్ర‌కాష్ నిర్మాత‌లు. జెడ్ త్రీ పిక్చ‌ర్స్ ప‌తాకంపై రూపొందుతోంది. ఈ సినిమాను న‌వంబ‌ర్ 6న క‌న్న‌డ‌, తెలుగు, హిందీలో విడుద‌ల చేయ‌నున్నారు. ఈ సినిమా ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ల‌ను, ట్రైల‌ర్ ను వ‌ర్మ త‌న మైక్రో బ్లాగింగ్ సైట్ లో ఎప్పుడో విడుద‌ల చేశారు.