Killi Kruparani: వైసీపీకి మరో షాక్.. కేంద్ర మాజీ మంత్రి రాజీనామా..
Send us your feedback to audioarticles@vaarta.com
ఎన్నికల సమయంలో అధికార వైసీపీకి మరో షాక్ తగిలింది. కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖను పార్టీ అధినేత, సీఎం జగన్‌కు పంపించారు. పార్టీలో తనకు అన్యాయం, అవమానం జరిగిందని ఆమె విమర్శించారు. శ్రీకాకుళం జిల్లా వైసీపీ అధ్యక్షురాలిగా ఎందుకు నియమించారో.. ఎందుకు తొలగించారో కూడా తెలియని పరిస్థితి ఉందని వాపోయారు. వైసీపీలో చేరిన సమయంలో తనకు కేబినెట్ స్థాయి పదవి, ఎంపీ టికెట్ ఇస్తారని హామీ ఇచ్చారని.. అయితే ఇప్పుడు మోసం చేశారని తెలిపారు. రాజకీయాల్లో తనకు పదవుల కంటే గౌరవమే ముఖ్యమని.. అందుకే వైసీపీని వీడుతున్నట్లు లేఖలో పేర్కొన్నారు.
ఈ ఎన్నికల్లో టెక్కలి నుంచి అసెంబ్లీకి పోటీ చేయాలని ఆమె భావించారు. అయితే కుదరని పరిస్థితుల్లో శ్రీకాకుళం ఎంపీగా పోటీ చేయాలనుకున్నారు. అయితే వైసీపీ పెద్దలు మాత్రం కృపారాణికి ఏ టికెట్ ఇవ్వలేదు. దీంతో తీవ్ర అసంతృప్తికి గురైన ఆమె వైసీపీకి గుడ్‌బై చెప్పేశారు. మరోవైపు ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరతారనే వార్తలు వస్తున్నాయి. టీడీపీ కూటమిలో చేరినా టికెట్ వచ్చే పరిస్థితి లేకపోవడంతో తిరిగి సొంతగూటి వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.
కాగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి శ్రీకాకుళం ఎంపీగా పోటీచేసి కృపారాణి గెలుపొందారు. ఆ ఎన్నికల్లో దివంగత టీడీపీ నాయకుడు కింజారపు ఎర్రనాయుడును ఓడించి పార్లమెంట్లో తొలిసారిగా అడుగుపెట్టారు. అనంతరం మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మంత్రివర్గంలో సహాయమంత్రిగా విధులు నిర్వర్తించారు. ఇక 2014లో రాష్ట్ర విభజన జరిగిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు.
2019 ఎన్నికల సమయంలో వైసీపీలో చేరారు. అయితే పార్టీలో తనకు సరైన గుర్తింపు లేదని అసంతృప్తితో ఉన్నారు. రాజ్యసభ పదవి ఇస్తారని భావించినా ఇవ్వలేదు. ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పిస్తారని అనుకున్నా అది కూడా దక్కలేదు. దీంతో ఆమె తిరిగి కాంగ్రెస్ పార్టీకే వెళ్లనున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి శ్రీకాకుళం ఎంపీగా పోటీ చేసే అవకాశాలున్నాయని సమాచారం. అలాగే అమె కుమారుడు విక్రాంత్ కూడా టెక్కలి ఎమ్మెల్యేగా పోటీ చేయనున్నారట.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com