నన్నూ, ఆర్జీవీని చంపేయండి: నట్టి కుమార్
Send us your feedback to audioarticles@vaarta.com
తనను, ఆర్జీవీని చంపేసి అనంతరం థియేటర్‌ను ధ్వంసం చేయాలని నిర్మాత నట్టి కుమార్ పేర్కొన్నారు. ‘మర్డర్’ సినిమా విడుదల కాకుండా అడ్డుకుంటున్నారంటూ ఆయన తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. మిర్యాలగూడకు చెందిన ప్రణయ్ పరువు హత్య నేపథ్యంలో ‘మర్డర్’ చిత్రం తెరకెక్కింది. ఆనంద్ చంద్ర ఈ చిత్రానికి దర్వకత్వం వహించారు. నట్టి కరుణ, క్రాంతి సంయుక్తంగా నిర్మించిన రాంగోపాల్ వర్మ కుటుంబ కథా చిత్రం ‘మర్డర్’. అయితే ఈ సినిమాను మిర్యాలగూడలో విడుదల చేస్తే థియేటర్లను ధ్వంసం చేస్తామంటున్నారని నట్టి కుమార్ మీడియా సమావేశంలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘మర్డర్’ సినిమా విషయమై నట్టి కుమార్ మాట్లాడుతూ.. ‘‘సినిమా ప్రారంభం నుంచి మాకు బెదిరింపు కాల్స్ వస్తూనే ఉన్నాయి. మిర్యాలగూడలో సినిమా విడుదల చేస్తే థియేటర్లు ధ్వంసం చేస్తామంటున్నారు. విడుదల రోజు నేను, రాంగోపాల్ వర్మ థియేటర్‌కి వస్తాం. మమ్మల్ని చంపేసి.. అనంతరం థియేటర్‌ని ధ్వంసం చేయండి’’ అని నట్టి కుమార్ పేర్కొన్నారు. రెండు రోజుల ముందు కూడా నట్టి కుమార్.. థియేటర్ల ఓపెన్ విషయమై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇండస్ట్రీలో ఐదుగురు మాత్రమే థియేటర్లను ఓపెన్ చేయకుండా అడ్డుకుంటున్నారని పేర్కొన్నారు. ఆ ఐదుగురు నిర్మాతలు హోటల్ దస్‌ఫల్లాలో మీటింగ్ పెట్టుకున్నారని వెల్లడించారు.
థియేటర్‌లు దయచేసి ఓపెన్ చేయనివ్వండి. లేకుంటే హైకోర్టు, సుప్రీంకోర్టు దాకా అయినా వెళ్తామన్నారు.
కాగా.. ‘మర్డర్’ సినిమాలో శ్రీకాంత్ అయ్యంగార్, గాయత్రీ భార్గవి, సాహితీ కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రం గురించి రాంగోపాల్ వర్మ మాట్లాడుతూ... ‘‘పిల్లలకు, తల్లిదండ్రులకు జరిగే నిరంతర యుద్ధమే ఈ సినిమా. వారి ఇష్టాలను కాదన్నపుడు ఎలాంటి నష్టం జరుగుతుందనేది ఈ చిత్రం ద్వారా చెబుతున్నాం. 22న మిర్యాలగూడలో ప్రెస్ మీట్ పెడుతున్నాం’’ అని వెల్లడించారు. ఈ సినిమా ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి సినిమాను ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారో వేచి చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout