Naveen Yerneni: మైత్రీ మూవీ మేకర్స్ అధినేత నవీన్ యెర్నేనిపై కిడ్నాప్ కేసు

  • IndiaGlitz, [Monday,April 15 2024]

మైత్రీ మూవీ మేకర్స్ అధినేతల్లో ఒక్కరైన నవీన్ యెర్నేనిపై కిడ్నాప్ కేసు నమోదైంది. జూబ్లీహిల్స్‌లోని క్రియా హెల్త్‌కేర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ షేర్ల బదలాయింపు వ్యవహారంలో నవీన్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. బలవంతంగా షేర్ల బదాలయించడం, బెదిరింపులతో కంపెనీ యాజమాన్య మార్పిడి ఆరోపణల నేపథ్యంలో నవీన్‌పై కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. త్వరలోనే నోటీసులు ఇచ్చి విచారిస్తామని వెల్లడించారు.

జూబ్లీహిల్స్‌ ఇన్‌స్పెక్టర్‌ వెంకటేశ్వర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంలో కీలక నిందితుడిగా ఉన్న టాస్క్‌ఫోర్స్‌ మాజీ డీసీపీ రాధాకిషన్‌రావు, ఇన్‌స్పెక్టర్‌ గట్టుమల్లు, ఎస్సై మల్లికార్జున్‌ సహా పలువురు నిందితులపై పంజాగుట్ట స్టేషన్‌లో పలు కేసులు నమోదు అయ్యాయి. ట్యాపింగ్ వ్యవహారం వెలుగులోకి వచ్చిన తర్వాత కొన్నేళ్ల క్రితం తనకు జరిగిన అన్యాయంపై ఎన్‌ఆర్‌ఐ వ్యాపారవేత్త చెన్నుపాటి వేణుమాధవ్‌ జూబ్లీహిల్స్‌ పోలీసులను సంప్రదించాడు. ట్యాపింగ్‌ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితులు తనను కూడా బెదిరించినట్టు ఫిర్యాదు చేశాడు.

ఈ కేసులో ఉన్న నిందితులు తనను గతంలో కిడ్నాప్‌ చేసి తన కంపెనీ షేర్లను బలవంతంగా బదలీ చేసుకున్నారని.. టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు వారికి సహకరించారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ వ్యవహారంలో పోలీసులతో పాటు తన సంస్థకు చెందిన నలుగురు డైరెక్టర్లకు సైతం లబ్ధి చేకూరినట్లు తెలిపాడు. దీంతో దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు ఆ సంస్థ ఎండీగా వ్యవహరించిన రాజశేఖర్‌ తలసిల, డైరెక్టర్లుగా ఉన్న గోపాలకృష్ణ సూరెడ్డి, నవీన్‌ యర్నేని, రవికుమార్‌ మందలపు, వీరమాచినేని పూర్ణచందర్‌రావులను తాజాగా నిందితుల జాబితాలో చేర్చారు. ఈ నేపథ్యంలో డైరెక్టర్లకూ నోటీసులిచ్చి విచారించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

జూబ్లీహిల్స్‌కు చెందిన ఎన్నారై వ్యాపారి చెన్నుపాటి వేణుమాదవ్‌ క్రియా హెల్త్‌ కేర్‌ను నెలకొల్పారు. అది లాభాలతో వృద్ధిలోకి వస్తున్న క్రమంలో టేకోవర్‌ చేసేందుకు సంస్థ డైరెక్టర్లు కొందరు ప్రముఖుల సాయంతో పథకం వేసినట్లు గుర్తించారు. ఇందులో రాజకీయ ఒత్తిళ్లు ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. రాజకీయ ప్రముఖుల ఆదేశాలతో టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు 2018లో వేణుమాధవ్‌ను కిడ్నాప్‌ చేసి రూ.40 కోట్ల విలువ చేసే షేర్లను అక్రమంగా బదలాయించారు. ఈ విషయం బయటకు చెబితే చంపేస్తామని రాధాకిషన్‌ రావు స్వయంగా బాధితుడిని బెదిరించారు.

కాగా ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంలో టాస్క్‌ఫోర్స్‌ డీసీసీగా పనిచేసిన రాధాకిషన్‌రావు అరెస్టు కావడంతో వేణుమాదవ్‌ జూబ్లీహిల్స్‌ పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు రాధాకిషన్‌రావు, గట్టుమల్లు, మల్లికార్జున్‌తోపాటు కృష్ణ, గోపాల్‌, రాజ్‌, రవి, బాలాజీ, చంద్రశేఖర్‌ వేగేతో పాటు మరికొందరిని నిందితులుగా పేర్కొంటూ కేసు నమోదు చేశారు.

 
 

More News

Salman Khan: సల్మాన్‌ఖాన్ ఇంటి వద్ద కాల్పుల ఘటనలో కీలక విషయాలు గుర్తింపు

బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్‌ఖాన్‌ (Salman Khan) ఇంటి వద్ద కాల్పులు తీవ్ర కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. సల్మాన్ నివాసం ఉంటున్న ముంబయిలోని బాంద్రా ప్రాంతంలో గల గెలాక్సీ అపార్ట్‌మెంట్స్‌

Vishal: తమిళనాట వేడెక్కిన రాజకీయాలు.. కొత్త పార్టీ పెడతానంటూ విశాల్ సంచలన ప్రకటన..

తమిళనాడు రాజకీయాలు రోజురోజుకు ఆసక్తిగా మారతున్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు మరో రెండు సంవత్సరాలు మాత్రమే ఉండటంతో సత్తా చాటేందుకు అన్ని పార్టీలు సిద్ధమవుతున్నాయి.

Kavitha: ఈనెల 23 వరకు కవితకు జ్యుడీషియల్ కస్టడీ.. బీజేసీ కస్టడీ అంటూ వ్యాఖ్యలు..

లిక్కర్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఇప్పుడల్లా ఊరట లభించేలా కనిపించడం లేదు. తాజాగా రౌస్ అవెన్యూ కోర్టు ఆమెకు ఈ నెల 23 వరకూ జ్యుడీషియల్ కస్టడీ విధించింది.

CM Jagan:రాజకీయంగా ఎదుర్కోలేక సీఎం జగన్‌ మీద దాడి చేసిన చంద్రబాబు బ్యాచ్

విజయవాడలో సీఎం జగన్‌పై టీడీపీ కార్యకర్తలు రాళ్ల దాడి చేశారు. బస్సు యాత్రలో భాగంగా సింగ్ నగర్‌కు చేరుకున్న క్రమంలో

Pemmasani:జగన్ అరాచకపాలనను అరికడతాం.. ప్రజలకు పెమ్మసాని భరోసా..

జగన్ అరాచక పాలనను అరికడతామని.. ప్రజలకు టీడీపీ జెండా అండగా ఉంటుందని గుంటూరు పార్లమెంట్ టిడిపి అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు.