బ్యాడ్మింటన్ లీగ్‌లో కోవిడ్ కలకలం.. కిదాంబి శ్రీకాంత్ సహా ఏడుగురికి పాజిటివ్
Send us your feedback to audioarticles@vaarta.com
భారత్‌లో కరోనా వైరస్ ప్రకంపనలు సృష్టిస్తోంది. నిపుణులు చెప్పినదాని కంటే వేగంగా కేసులు విస్తరిస్తున్నాయి. ఇప్పటికే రోజువారీ కేసుల సంఖ్య రెండు లక్షలు దాటింది. గడిచిన 24 గంటల వ్యవధిలో 2,47,417 మందికి కోవిడ్ పాజిటివ్‌గా తేలింది. మహారాష్ట్రలో అత్యధికంగా 46,723 మంది, ఢిల్లీలో 27,561 మంది కరోనా బారినబారినపడ్డారు. నిన్న కోవిడ్ కారణంగా 380 మంది ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు సామాన్యులతో పాటు ప్రముఖులు కూడా వైరస్ బాధితులుగా మారుతున్నారు. ఇప్పటికే పలువురు సినీ, క్రీడా, రాజకీయ తదితర రంగాల ప్రముఖులకు పాజిటివ్‌గా తేలింది. ముఖ్యంగా సినీ పరిశ్రమ కరోనాకు హాట్ స్పాట్‌గా మారినట్లుగా కనిపిస్తోంది.
తాజాగా ఈ లిస్ట్‌లో క్రీడాకారులు చేరుతున్నారు. ఇటీవల ప్రారంభమైన ఇండియా ఓపెన్‌లో మొత్తం ఏడుగురు బ్యాడ్మింటన్ క్రీడాకారులు కరోనా వైరస్ బారిన పడ్డారు. దీంతో ఒక్కసారిగా కలకలం రేగింది. మాజీ ప్రపంచ నంబర్ వన్ ఆటగాడు కిదాంబి శ్రీకాంత్, అశ్విని పొన్నప్ప, రితికా రాహుల్ థక్కర్, ట్రెస్సా జోలీ, మిథున్ మంజునాథ్, సిమ్రన్ అమాన్ సింఘీ, కుషి గుప్తా ఉన్నారు. వీరికి కోవిడ్ సోకిన నేపథ్యంలో క్రీడాకారుల డబుల్స్ పార్ట్నర్స్ సైతం టోర్నీ నుంచి తప్పుకున్నట్లు బీడబ్ల్యూఎఫ్ వెల్లడించింది.
ఈ క్రమంలోనే మెయిన్ డ్రాలో పాల్గొనని ఆటగాళ్లకు బదులుగా వేరేవారిని మార్చే ప్రసక్తి లేదని, దీంతో వారి ప్రత్యర్థులను నేరుగా తదుపరి రౌండ్లకు ప్రమోట్ చేస్తామని బీడబ్ల్యూఎఫ్ పేర్కొంది. ఈ విషయాన్ని బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (బీఏఐ) ధ్రువీకరించింది. కాగా, జనవరి 11న మొదలైన ఈ ఇండియా ఓపెన్ టోర్నీలో గురువారం రెండో దశ మ్యాచ్‌లు జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో టోర్నీని రద్దు చేస్తారా లేక అలాగే కొనసాగిస్తారా అన్నది తేలాల్సి వుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments