మెగాస్టార్ ని అనుకరించిన ఈ బుడతడు ఎవరో తెలుసా..
Tuesday, July 12, 2016 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
మెగాస్టార్ చిరంజీవి స్టిల్ చూసారు కదా....ఈ స్టైల్ ఏ సినిమాలో గుర్తుంది కదా...ఎస్..గ్యాంగ్ లీడర్. ఈ చిత్రంలో చిరంజీవి చెప్పిన ...చెయ్యి చూసావా ఎంత రఫ్ గా ఉందో...రఫ్ ఆడించేగలను అనే డైలాగ్ ఎంత పాపులరో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ డైలాగ్ తో పాటు చొక్కా కాలర్ ని స్టిల్ లో చూపించినట్టు పైకి ఎత్తే ఫోజు ప్రేక్షకాభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది.
అయితే...గ్యాంగ్ లీడర్ ను ఈ బుడతడు అనుకరించాడు. ఇంతకీ ఈ బుడతడు ఎవరనుకుంటున్నారా..? మెగా బ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్ తేజ్. చిన్నప్పుడే వరుణ్ తేజ్ పెదనాన్న చిరంజీవిని అనుకరించాడు. ఈ విషయాన్ని వరుణ్ తేజ్ ట్విట్టర్ ద్వారా తెలియచేస్తూ...గ్యాంగ్ లీడర్ ను అనుకరించే ప్రయత్నం చేసాను అంటూ ఈ స్టిల్ పోస్ట్ చేసాడు. ఇటీవల చిరంజీవి 150వ చిత్రం ఫస్ట్ డే షూటింగ్ కి కూడా వరుణ్ తేజ్ వెళ్లి చిరంజీవిని కలిసారు. దీనిని బట్టి అర్ధం చేసుకోవచ్చు పెదనాన్న చిరంజీవి అంటే వరుణ్ తేజ్ కి ఎంత ఇష్టమో..!
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments