ధృవ సెట్ లో సందడి చేసిన బుడతడు..
Send us your feedback to audioarticles@vaarta.com
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న తాజా చిత్రం ధృవ. ఈ చిత్రాన్నిసురేందర్ రెడ్డి తెరకెక్కిస్తున్నారు. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ ఈ చిత్రాన్నినిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో చరణ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తుంది. ఇటీవల ధృవ చిత్రయూనిట్ కాశ్మీర్ షెడ్యూల్ పూర్తి చేసుకుని సిటీకి చేరుకుంది.
అయితే...ధృవ కాశ్మీర్ షెడ్యూల్ ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఈ ఫోటోల్లో చరణ్ ఓ బాలుడుని గుర్రం ఎక్కిస్తున్నాడు. ఈ లేటెస్ట్ స్టిల్స్ ఆకట్టుకుంటున్నాయి. ఇంతకీ ధృవ సెట్ లో సందడి చేసిన ఆ బాలుడు ఎవరనేది తెలియాల్సివుంది. తని ఓరువన్ రీమేక్ గా రూపొందుతున్న ధృవ చిత్రాన్ని దసరా కానుకగా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com