అంతా మెగాస్టార్ వల్లే... అంటున్న సుదీప్
Send us your feedback to audioarticles@vaarta.com
తాను ఆ నిర్ణయం తీసుకోవడానికి కారణం మెగాస్టారే అని అంటున్నారు కన్నడ నటుడు సుదీప్. ఆయన ఈ మధ్య ఇద్దరు మెగాస్టార్లతో కలిసి పనిచేశారు. వారిలో ఒకరు టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి కాగా, మరొకరు బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్. వారితో కలిసి ఆయన నటించిన చిత్రం `సైరా`. అక్టోబర్ 2న విడుదల కానుంది. ఆంగ్లేయులను ఎదిరించిన తొలితరం పాలెగాడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డికి సంబంధించిన కథ అది. సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ పతాకంపై రామ్‌చరణ్ నిర్మిస్తున్నారు.
ఇంతకీ సుదీప్ నేర్చుకున్నది ఏ మెగాస్టార్‌ను చూసి? నేర్చుకున్న విషయం ఏంటి?... అక్కడికే వస్తున్నాం. సుదీప్ చెప్పింది మన మెగాస్టార్ చిరంజీవి గురించి. చిరంజీవి తన కష్టంతో పైకి ఎదిగిన వ్యక్తి. టాలీవుడ్ చరిత్రలోనే స్వయంకృషితో అంత ఎత్తుకు ఎదిగి, మెగాస్టార్‌గా నెంబర్ వన్ పొజిషన్‌లో సస్‌టైన్ అవుతున్న హీరో ఇంకొకరు లేరంటే అతిశయోక్తి కాదు. అలాంటి వ్యక్తిని చూసి సుదీప్ నేర్చుకున్నది సినిమా సంగతులు కాదు. రాజకీయ సంగతులు. నిత్యం నేమ్‌తో, ఫేమ్‌తో వెలిగిన చిరంజీవి రాజకీయాలకు వెళ్లి, సినిమాలకు దూరమయ్యారు. ఓ నటుడిగా అది ఎంత ఇబ్బందికర విషయమో తాను అర్థం చేసుకోగలను అని అన్నారు సుదీప్. అందుకే రాజకీయాల్లోకి వెళ్లకూడదని నిర్ణయించుకున్నట్టు తెలిపారు. తన పదేళ్ల కష్టానికి ఇప్పుడు ఫలితం అందుతోందని, రాజకీయాలకు వెళ్లి దాన్ని దూరం చేసుకోదలచుకోలేదని అన్నారు. ఆయనకు స్టార్‌డమ్ మీద కూడా పట్టింపులేదట. అది రిలేషన్‌షిప్ లాంటిదని, ఇవాళ మనతో ఉండి, రేపు ఇంకెక్కడ ఉంటుందో చెప్పలేమని చమత్కరించారు. ఆ మధ్య సుదీప్ వ్యక్తిగత జీవితంలో ఒడుదొడుకులు ఎదురయ్యాయి. అతనికీ,అతని భార్యకు పొసగని సంగతి తెలిసిందే. అలాగే హిట్టూ, ఫ్లాపులను కూడా పట్టించుకోననీ, తనకు తెలిసింది కష్టపడి పనిచేయడం మాత్రమేనని అన్నారు.
ఇటీవల కుస్తీ వీరుడిగా ఆయన నటించిన పహిల్వాన్ విడుదలైంది. వారాహి చలనచిత్రం విడుదల చేసింది. కన్నడలో ఫర్వాలేదనే టాక్ వచ్చినప్పటికీ తెలుగులో ప్రేక్షకులను మెప్పించలేకపోయింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments