కియారా కత్తిరించేసింది
- IndiaGlitz, [Thursday,May 02 2019]
హిందీలో ఇటీవల 'గల్లీబోయ్' సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే. ఈ సినిమాలో హీరో తనకు తోచిన పదాలతో, ఆసక్తికరంగా ర్యాప్ పాడుతుంటారు. ఈ తరహాలోనే హీరోయిన్ కియారా అద్వాణీ కొత్త ప్రయోగం చేశారు. కాకపోతే తన జుట్టు మీద. దీన్నే ఇప్పుడు నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. 'ఆయిల్ సరిగా పెట్టలేదు. జుట్టు బాగా పాడయిపోయింది. ఎంత ప్రయత్నించినా చూడ్డానికి బాగోలేదు. అలాంటి సమయంలో నేను చేయాల్సింది ఒకటే పని.. కత్తిరించేయడం' అంటూ తన స్టైల్లో పాట పాడుతూ జుట్టును అడ్డదిడ్డంగా కత్తిరించి, ఆ ఫొటోను పెట్టింది కియారా.
ఎక్కడో కేర్వ్యాన్లో ఉండి, ఆమె ఈ పనిచేసినట్టు అర్థమవుతోంది. దీనికి నెట్లో వెంటనే ట్రోల్స్ మొదలయ్యాయి. సినిమాలు పెద్దగా లేనప్పుడు ఇలాంటి జిమ్మిక్కులు చేస్తారని కొందరు, ఇది కూడా ఏదో కొత్త సినిమా ప్రమోషన్లో భాగమై ఉంటుందని మరికొందరు, జుట్టు కత్తిరించడానికి ఇంత హడావిడి అవసరమా అని మరికొందరు ట్రోల్ చేస్తున్నారు. కియారా తెలుగులో మహేష్ తో భరత్ అనే నేనులో, రామ్చరణ్ సరసన వినయ విధేయ రామాలో నటించింది. హిందీలో కబీర్సింగ్లోనూ, లారెన్స్ దర్శకత్వంలో అక్షయ్ కుమార్ సినిమాలోనూ నటించనుంది.
View this post on InstagramA post shared by KIARA (@kiaraaliaadvani) on Apr 29, 2019 at 10:54pm PDT