ప్రేమ పెళ్ళే ఇష్టమంటున్నమహేష్ హీరోయిన్ కియరా
- IndiaGlitz, [Sunday,July 28 2019]
అటు బాలీవుడ్, ఇటు టాలీవుడ్లో హీరోయిన్గా తనకంటూ ఓ ఇమేజ్ను సొంతం చేసుకుంది కియరా అడ్వానీ. అమ్మడు నటించిన అర్జున్ రెడ్డి బాలీవుడ్ రీమేక్ 'కబీర్ సింగ్' 300 కోట్ల రూపాయల వసూళ్లను సాధించి సెన్సేషనల్ హిట్ అయ్యింది.
ఈ నేపథ్యంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ తన పెళ్లి గురించి అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చారు. తన తల్లిదండ్రులు ఏడేళ్లు డేటింగ్ చేసుకుని వివాహం చేసుకున్నారు. కాబట్టి నాకు లవ్ మ్యారేజే చేసుకోవాలనుంది. ఇతనితోనే మిగతా జీవితం అని అనిపించిన రోజు తప్పకుండా పెళ్లి చేసేసుకుంటానని అంటూ చెప్పిన కియరా అడ్వానీ. నిజాయతీ పరుడై ఉండాలి.. కష్టపడే తత్వముండేవాడిగా ఉండాలంటూ భర్తకు కాబోయే లక్షణాలు గురించి కూడా చెప్పింది.