మహేశ్ హీరోయిన్ పెళ్లి ఫిక్స్ అయినట్లేనా.. బీ టౌన్‌లో న్యూస్ వైరల్..!!
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రస్తుతం టాలీవుడ్ టు కోలీవుడ్‌లలో ప్రేమ జంటలు ఒక్కొక్కటిగా పెళ్లిపీటలెక్కుతున్నాయి. ఇప్పటికే నయనతార - విఘ్నేష్ శివన్, కత్రినా కైఫ్ - విక్కీ కౌశల్, మంజిమా మోహన్ - గౌతమ్ కార్తీక్‌లు వివాహ బంధంతో ఒక్కటవ్వగా... మరికొన్ని జంటలు క్యూలో వున్నాయి. వీరందరిలోకి ప్రముఖంగా వినిపిస్తున్నది సిద్ధార్ధ్ మల్హోత్రా - కియారా అద్వానీల గురించే. గత కొన్నేళ్లుగా వీరు ప్రేమలో మునిగి తేలుతున్న విషయం తెలిసిందే. ముంబై, హైదరాబాద్ , చెన్నై ఇలా ప్రతి చోటా చెట్టాపట్టాలేసుకుని తిరుగుతోంది ఈ జంట. వీరిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని మీడియా జనాలు ముహూర్తాలు కూడా పెట్టేశారు. కానీ ఇవన్నీ గాలి వార్తలుగానే మిగిలిపోయాయి.
షేర్షా సినిమా టైంలో ప్రేమలో పడ్డ సిద్ధార్ధ్ - కియారా:
షేర్షా సినిమాలో పనిచేస్తుండగా సిద్ధార్ధ్, కియారాలు ప్రేమలో పడ్డారు. అప్పటి నుంచి వీరిద్దరూ డేటింగ్‌లోనే వున్నారు. అప్పటి నుంచి వీరి పెళ్లికి సంబంధించి రకరకాల కథనాలు వచ్చాయి. అయితే ఈ జంట డిసెంబర్ లేదా జనవరిలో పెళ్లి పీటలెక్కబోతున్నట్లు సమాచారం. వివాహ వేడుక చండీగఢ్‌లో జరుగుతుందని అంచనా. గతంలోనే ఈ జంట గోవాలో వివాహం చేసుకోవాలని నిర్ణయించింది. అయితే సిద్ధార్థ్ కుటుంబం, ఇతర బంధు మిత్రులు పంజాబ్‌లో వుండటంతో పెళ్లి వేదికను చండీగఢ్‌కు మార్చినట్లుగా తెలుస్తోంది.
చేతి నిండా సినిమాలతో కియారా :
పెళ్లి తేదీ, ముహూర్త సమయం త్వరలోనే వెలువడే అవకాశం వుంది. అంతా సవ్యంగా జరిగితే సిద్ధార్, కియారాలు కొత్త సంవత్సరంలో పెళ్లి పీటలెక్కిన తొలి బాలీవుడ్ సెలబ్రెటీ జంటగా మారొచ్చు. ఇక సినిమాల విషయానికి వస్తే.. కియారా అద్వానీ ప్రస్తుతం ‘‘గోవింద నామ్ మేరా’’లో నటిస్తోంది. ఇందులో విక్కీ కౌశల్, భూమి పడ్నేకర్‌లతో ఆమె స్క్రీన్ షేర్ చేసుకుంటోంది. ఈ కామెడీ థ్రిల్లర్ డిసెంబర్ 16న డీస్నీ హాట్‌స్టార్‌లో డైరెక్ట్ రిలీజ్ కానుంది. అలాగే తమిళ దర్శక దిగ్గజం శంకర్- రామ్ చరణ్ కాంబినేషన్‌లో తెరకెక్కతోన్న RC15లోనూ కియారా హీరోయిన్‌గా నటిస్తోంది. మరోవైపు... సిద్ధార్ధ్ అమెజాన్ ప్రైమ్ నిర్మించిన ఇండియన్ పోలీస్ వెబ్ సిరీస్‌లో కనిపించనున్నారు. ఇది ఆయనకు తొలి ఓటీటీ ప్రాజెక్ట్. కానీ రోహిత్ శెట్టి ఆ ప్రాజెక్ట్‌ను నిలిపివేశారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments