సిద్దార్థ్‌తో డేటింగ్.. కియారా ఓపెన్ అయిపోయింది..!
Send us your feedback to audioarticles@vaarta.com
బాలీవుడ్లో కియారా అడ్వాణి.. స్టార్ హీరోయిన్గా వెలుగొందుతోంది. వరుస ఆఫర్లతో కియారా దూసుకుపోతోంది. వెండితెరతో పాటు రియల్ లైఫ్‌లోనూ చాలా యాక్టివ్‌గా ఉండే ఈ ముద్దుగుమ్మ తన డేటింగ్ విషయంలో ఓపెన్ అయిపోయినట్టు తెలుస్తోంది. అమ్మడు ప్రేమ గురించి ఎప్పటి నుంచో వార్తలు వస్తూనే ఉన్నాయి. హీరో సిద్ధార్థ్ మల్హోత్రతో కియార డేటింగ్ చేస్తోందని బాలీవుడ్లో టాక్ నడుస్తోంది. అయితే ఈ విషయాన్ని వీరిద్దరూ కూడా ఇప్పటి వరకూ అంగీకరించలేదు. ఎప్పటికప్పుడు ఖండిస్తూనే వస్తున్నారు.
తాజాగా కియారా, సిద్ధార్థ్‌ల జంట ముంబై విమానాశ్రయంలో కెమేరాల కంటికి చిక్కింది. నూతన సంవత్సర వేడుకల కోసం వీరిద్దరూ జంటగా మాల్దీవులకు వెళుతూ అడ్డంగా దొరికిపోయారు. విమానాశ్రయానికి ఇద్దరూ ఒకే కారులో వచ్చారు. దీంతో తమ ప్రేమ గురించి వీరు అధికారికంగా అంగీకరించినట్టేనని జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అంతేకాదు.. మాల్దీవులకు చేరగానే వీరు తమ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో కియారా తన డేటింగ్ విషయంలో ఓపెన్ అయినట్టేనని నెటిజన్లు భావిస్తున్నారు.
కాగా.. గతంలో ఓ ఇంటర్వ్యూలో కియారా డేటింగ్ గురించి మాట్లాడుతూ.. ‘ఏదో ఒక రోజు ఎవరో ఒకరితో మింగిల్ కావల్సిందే కాబట్టి.. మనసుకు నచ్చిన వాడు దొరికితే డేటింగ్ చేయడానికి వెనకాడనని తెలిపింది. ఒకవేళ అదే జరిగితే మొదటి డేట్లోనే అతనికి ముద్దు మాత్రం ఇవ్వనని, ఊరించి వెంటపడేలా చేస్తానని తన మనసులో మాట బయటపెట్టింది. అయితే ప్రస్తుతానికి తాను సింగల్ అని చెప్పిన ఈ బ్యూటీ.. తాను బాగా ఇష్టపడే ప్రదేశం మాల్దీవ్స్ అని, అక్కడి స్కూబా డైవింగ్ అంటే ఎంతో ఇష్టమని తెలిపింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com