చరణ్ కోసం కియారా.. దర్శకుడు గట్టి ప్రయత్నాలు!!
Send us your feedback to audioarticles@vaarta.com
కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న సినిమా వేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కూడా నటిస్తున్నారు. నిర్మాత కూడా అయిన చెర్రీ.. నక్సలైట్ పాత్రలో నటిస్తున్నట్టు సమాచారం. అయితే ఇద్దరూ కలిసి నటిస్తున్నారా.. లేక చిరు ఫ్లాష్ బ్యాక్‌లో చరణ్ కనిపిస్తాడా అనేది తెలియాల్సి ఉంది.
ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ కియారా అడ్వాణీ నటిస్తోందని టాక్. ఇప్పటికే కొరటాల ఆమెతో మాట్లాడినట్టు తెలుస్తోంది. ఇద్దరితో ఒక పాటను షూట్ చేయాలనుకుంటున్నట్టు సమాచారం. ప్యాన్ ఇండియా మూవీగా దీన్ని మలుస్తున్న ఈ చిత్ర బృందం.. కియారా నటించడం ద్వారా ఎంతో కొంత ఉపకరిస్తుందని భావిస్తోంది. ఈ సినిమాలో చిరు సరసన త్రిష నటిస్తోంది.
హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో సైరా నరసింహారెడ్డి కోసం వేసిన ఓ సెట్లో చిన్న చిన్న మార్పులు చేసిన చిరు 152 సినిమాను చిత్రీకరిస్తున్నారు. త్రిష హీరోయిన్గా నటించనుంది. ఆగస్ట్ 14న ఈ సినిమాను విడుదల చేస్తారని వార్తలు వినపడుతున్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com