ప్రేమ వివాహమే చేసుకుంటా.. సిద్దార్థ్ మల్హోత్రాతో డేటింగ్ పై కియారా క్లారిటి
Send us your feedback to audioarticles@vaarta.com
కియారా అద్వానీ.... తెలుగు లో భరత్ అను నేను మూవీలో నటించి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. తొలి సినిమాతోనే స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందిన కియారా... ఆ తర్వాత వెంటనే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సరసన వినయ విధేయ రామ సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. కానీ సరైన కంటెంట్ లేకపోవడంతో బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టింది ఈ సినిమా. కానీ... అర్జున్ రెడ్డి రీమేక్ గా హిందీలో వచ్చిన కబీర్ సింగ్ తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది.
ప్రస్తుతం ఆ మూవీ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న కియారా.. లారెన్స్ దర్శకత్వంలో వస్తున్న లక్ష్మి బాంబ్ సినిమాలో నటిస్తుంది. ఈ సినిమా తెలుగులో వచ్చిన కాంచన మూవీకి రీమేక్ కాగా... అక్షయ్ కుమార్ హీరో.
అయితే బాలీవుడ్ హీరో సిద్దార్థ్ మల్హోత్రాతో ఈ అమ్మడు డేటింగ్ లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మధ్య ఓ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో వీటన్నిటికీ సమాధానం ఇచ్చింది. తమ మధ్య అలాంటిది ఏమి లేదని స్పష్టం చేసింది. కానీ భవిష్యత్తులో పెద్దలు కుదిర్చిన పెళ్లి కాకుండా ... ప్రేమ వివాహం చేసుకుంటాను అని స్పష్టం చేసింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments