సోనాలి త‌రువాత కియారానే..

  • IndiaGlitz, [Tuesday,April 24 2018]

తాజాగా విడుద‌లైన భ‌ర‌త్ అనే నేను.. సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు కెరీర్‌లో మ‌రో విజ‌య‌వంత‌మైన చిత్రంగా నిలిచిపోయింది. అలాగే.. ఇందులో మహేష్‌కు జోడీగా న‌టించిన క‌థానాయిక కియారా అద్వానీకి తెలుగులో మంచి ఎంట్రీ మూవీ అయ్యింది. ప్ర‌స్తావించ‌ద‌గ్గ విష‌య‌మేమిటంటే.. ఇప్ప‌టివ‌ర‌కు మ‌హేష్ సినిమాతో తెలుగునాట ఎంట్రీ ఇచ్చిన భామల్లో ఒక్క సోనాలి బింద్రే త‌ప్ప మ‌రెవ‌రూ.. తొలి తెలుగు చిత్రంతో విజ‌యం అందుకున్న వైనం లేదు.

మ‌హేష్‌తో సోనాలి న‌టించిన మురారి అప్ప‌ట్లో మంచి విజ‌యం సాధించ‌డ‌మే కాకుండా.. సోనాలికి తెలుగులో మ‌రిన్ని అవ‌కాశాలు క‌ల్పించింది. అయితే సోనాలికి ముందు, త‌రువాత‌.. మ‌హేష్ సినిమాతోనే తెలుగులో ఎంట్రీ ఇచ్చిన ఉత్త‌రాది భామ‌లు న‌మ్ర‌తా శిరోద్క‌ర్ (వంశీ), లీసారే, బిపాసా బ‌సు (ట‌క్క‌రిదొంగ‌), అమృతా రావు (అతిథి), కృతి స‌న‌న్ (1 నేనొక్క‌డినే) మాత్రం తెలుగులో స‌క్సెస్‌ఫుల్‌గా కెరీర్‌ను న‌డిపించ‌లేక‌పోయారు. అయితే.. కియారా మాత్రం సోనాలి బాట‌లోనే తొలి తెలుగు చిత్రంతో హిట్ కొట్టి.. మ‌హేష్‌కు క‌లిసొచ్చిన క‌థానాయిక‌ల్లో ఒక‌రిగా నిలిచింది.