"గాలివాన' వెబ్ సిరీస్ లో రాధిక శరత్ కుమార్ క్యారెక్టర్ ప్రోమోను విడుదల చేసిన సీనియర్ నటి కుష్బూ
Send us your feedback to audioarticles@vaarta.com
పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ నుండి కామెడీ డ్రామా "ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ" మరియు అన్నపూర్ణ స్టూడియోస్ నుండి "లూజర్" లూజర్ 2 వంటి టాప్ నాచ్ సిరీస్ తర్వాత బిబిసి స్టూడియోస్, నార్త్‌స్టార్ ఎంటర్టైన్మెంట్ భాగ స్వామ్యంతో బిబిసి స్టూడియోస్ నిర్మించిన యురోపియన్ డ్రామాను తెలుగు ప్రేక్షకుల అభిరుచుల మేరకు మార్పులు చేసి ZEE5 వారు ‘గాలివాన’ అనే ఒరిజినల్ సిరీస్‌గా నిర్మిస్తోంది.
ZEE5 ఓటిటి లో ఏప్రిల్ 14 న స్ట్రీమింగ్ కానున్న "గాలివాన' వెబ్ సిరీస్ లో రాధిక శరత్ కుమార్ క్యారెక్టర్ ప్రోమోను సీనియర్ నటి కుష్బూ గారు ఈ రోజు సాయంత్రం 4 గంటలకు విడుదల చేశారు. రాధికా శరత్ కుమార్ చెప్పిన పవర్ ఫుల్ డైలాగ్స్ ప్రోమో ను చూస్తుంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. జీవితంలో మనకు ఎన్నో కష్టాలు వచ్చాయి.కానీ నిజమైన కస్టం ఏమిటో.. తెలుసా శ్రావణి ? ఏ.. కొడుకునైతే నవమాసాలు మోసి కన్నానో..వాడికి కర్మ కాండలు జరిపించడం. నా కోడుకు, కోడలును చంపిన వాడు బ్రతకకూడదు. అని చెప్పే డైలాగ్ లు "గాలివాన" లో ఫ్యామిలీ, రివెంజ్ డ్రామాగా తెరకెక్కినట్లు ప్రేక్షకులకు అర్థమవుతుంది. రాధిక గారు చెప్పిన ఎమోషన్ డైలాగ్స్ యూట్యూబ్ లో సంచలనం సృస్టిస్తూ.. మంచి వ్యూస్ తెచ్చుకొంటుంది.గతంలో కూడా ఎన్నో ఫ్యామిలీ రివెంజ్ డ్రామా కథలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుని విజయం సాధించాయి. ఆ కోవలో ఈ గాలివాన కూడా సక్సెస్ సాధిస్తుందని మేకర్స్ ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు.ఈ వెబ్ సిరీస్ ను వీక్షకులకోసం ఏప్రిల్ 14 న Zee5 ఓటిటి లో స్ట్రీమింగ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
ఇందులో రాధికా శరత్ కుమార్, డైలాగ్ కింగ్ సాయి కుమార్ ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా చాందిని చౌదరి, చైతన్య కృష్ణ, శరణ్య ప్రదీప్, అశ్రిత, అర్మాన్ మరియు నందిని రాయ్, తాగుబోతు రమేష్, కీలక పాత్రలు పోషిస్తున్నారు.
నటీనటులు : సాయికుమార్, రాధిక శరత్‌కుమార్, నందిని రాయ్, చాందిని చౌదరి, చైతన్య కృష్ణ, అశ్రిత వేముగంటి, తాగుబోతు రమేష్, అర్మాన్, శరణ్య ప్రదీప్, ఆర్. రమేష్, శ్రీలక్ష్మి, నిఖిత, చరిత్, సతీష్ సారిపల్లి, నానాజీ, నవీన్, సూర్య శ్రీనివాస్, జయచంద్ర తదితరులు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com