Khushbu:రోజాపై బండారు వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన ఖుష్భూ.. క్షమాపణలు చెప్పే వరకు పోరాటం చేస్తా

  • IndiaGlitz, [Friday,October 06 2023]

మంత్రి రోజాపై టీడీపీ నేత, మాజీ మంత్రి బండారు సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలపై సీనియర్ నటి, బీజేపీ నాయకురాలు ఖుష్బూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళా ప్రజాప్రతినిధిపై ఆయన చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నానని ఆమె ఓ వీడియో విడుదల చేశారు. తక్షణమే బండారు సత్యనారాయణ రోజాకు క్షమాపణలు చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. రోజాకు క్షమాపణలు చెప్పే వరకు పోరాటం చేస్తానని స్పష్టం చేశారు. బండారు రాజకీయ నాయకుడిగానే కాదు.. మనిషిగా కూడా విఫలమయ్యారని మండిపడ్డారు. ఓ స్నేహితురాలిగా కాకుండా సాటి మహిళగా రోజాకు మద్దతు ఇస్తున్నానని తెలిపారు.

నారీ శక్తి వంటి చట్టాలు తెచ్చుకుంటున్న తరుణంలో ఇలాంటి వ్యాఖ్యలు దారుణం..

దేశంలో నారీ శక్తి వంటి చట్టాలను తెచ్చుకుంటున్నామని.. మహిళ రిజర్వేషన్ బిల్లును కూడా ప్రధాని మోదీ తెచ్చిన విషయాన్ని ఆమె గుర్తుచేశారు. ఇలాంటి తరుణంలో బండారు లాంటి వాళ్లు మహిళలపై ఇంత దారుణంగా మాట్లాడతారా..? అని ఫైర్ అయ్యారు. మహిళలపై నీచాతి నీచంగా మాట్లాడటం వారి మానసిక దౌర్భల్యానికి నిదర్శనం అన్నారు. బండారు లాంటి వ్యక్తులు మహిళల గురించి నీచంగా మాట్లాడటం తమ జన్మ హక్కు అనుకుంటున్నారని ఆమె దుయ్యబట్టారు. ఇలాంటి వ్యక్తులను ప్రజాప్రతినిధులుగా గెలవడం ప్రజల దురుదృష్టం అంటూ ఖుష్భూ పేర్కొన్నారు. రోజా గురించి ఇంత దారుణంగా మాట్లాడిన బండారు తన నియోజకవర్గ మహిళలను కూడా అవమానించినట్లే అంటూ మండిపడ్డారు.

బండారు వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన నటి కవిత, సీనియర్ జర్నలిస్ట్ ఉమా సుధీర్..

కాగా రోజాపై బండారు వ్యాఖ్యలను సీనియర్ నటి కవిత, సీనియర్ జర్నలిస్ట్ ఉమా సుధీర్ తీవ్రంగా ఖండించిన సంగతి తెలిసిందే. దివంగత మాజీ ముఖ్యమంత్రి స్థాపించిన పార్టీలోని నాయకులు మహిళల గురించి ఇంత నీచంగా మాట్లాడటం సిగ్గు చేటని కవిత మండిపడ్డారు. ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న మంత్రి రోజా పట్ల టీడీపీ నేతలు ఇలాంటి నీచపు వ్యాఖ్యలు చేయడం దారుణమని ఉమా సుధీర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే బండారు సత్యనారాయణ రోజాతో పాటు మహిళలకు క్షమాపణలు చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు.

More News

KTR:సీఎం బ్రేక్‌ఫాస్ట్ పథకం ప్రారంభించిన మంత్రి కేటీఆర్.. స్వయంగా విద్యార్థులకు వడ్డించి వారితో కలిసి టిఫిన్

తెలంగాణ ప్రభుత్వం విద్యార్థుల కోసం మరో కొత్త పథకం తీసుకువచ్చింది. సికింద్రాబాద్ పరిధిలోని వెస్ట్ మారేడ్‌పల్లిలో సీఎం బ్రేక్‌ఫాస్ట్ పథకాన్ని మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.

TSRTC:టీఎస్ఆర్టీసీ ఛైర్మన్‌గా ముత్తిరెడ్డి.. రాజయ్యకూ కీలక పదవి.. అసంతృప్తులకు ఇలా చెక్ పెట్టిన కేసీఆర్

ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో ఎమ్యెల్యే టికెట్ రాని అసంతృప్తులను చల్లార్చేందుకు గులాబీ బాస్ కేసీఆర్ విరుగుడు చర్యలు తీసుకున్నారు.

BRS, Congress:తెలంగాణలో గులాబీ పార్టీకి షాక్ ఖాయం.. కాంగ్రెస్‌దే అధికారం అంటున్న లోక్‌పోల్ సర్వే

తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఓ సర్వే ఫలితాలు రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.

Bigg Boss 7 Telugu : ప్రేమ పాఠాలు చెప్పిన శుభశ్రీ.. దోస్త్ మేరా దోస్త్ అంటున్న తేజ - ప్రిన్స్ యావర్

బిగ్‌బాస్ 7 తెలుగులో ప్రస్తుతం కెప్టెన్సీ కోసం టాస్క్‌లు నడుస్తున్న సంగతి తెలిసిందే. బుధవారం జరిగిన టాస్క్‌ల్లో శివాజీ,

Pawan Kalyan:ఏపీని వైసీపీ రహిత రాష్ట్రంగా మారుస్తాం: పవన్ కల్యాణ్

ఎన్డీఏ నుంచి బయటకు వస్తే తానే చెబుతానని.. అంతేకానీ దొంగ చాటుగా బయటకు రానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.