ఖుష్బు చేతల మీదుగా 'కళావతి' ఫస్ట్‌లుక్ విడుదల
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రముఖ దర్శకుడు సుందర్ సి దర్శకత్వంలో తమిళంలో ఆరణ్మనిగా సూపర్‌డూపర్ హిట్టయ్యి ఇప్పడు అరణ్మయి 2 గా ఇప్పటికే తమిళనాట సంచలనాన్ని క్రియెట్ చేస్తున్న చిత్రానికి తెలుగులో కళావతి అనే టైటిల్ ని ఖరారు చేసిన విషయం తెలిసిందే. సర్వంత్రామ్ క్రియేషన్స్ మరియు ఈరోజుల్లో, రోమాన్స్ లాంటి పలు విజయవంతమైన చిత్రాల్ని అందించిన గుడ్ సినిమా గ్రూప్ తెలుగు లో నిర్మిస్తున్నారు. శ్రీ జవ్వాజి రామాంజనేయులు చిత్ర సమర్పకులు, ఈ చిత్రంలో సుందర్ సి, సిద్ధార్థ, త్రిష, హన్సిక మోత్వాని, పూనమ్ బాజ్వా ముఖ్య పాత్రలు పోషించారు. హార్రర్ కామెడీ జోనర్ లో తెరకెక్కించిన ఈ చిత్రానికి సుందర్ సి దర్శకత్వం వహించారు. హిప్ హాప్ తమీఝా సంగీతమందించారు. ఈ చిత్రం యెక్క మెదటి లుక్ ని తమిళం లో లేడి సూపర్‌స్టార్ ఖుష్బు చేతుల మీదుగా విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ నటి ఖుష్బు, దర్శకుడు సుందర్.సి. చిత్ర సమర్పకుడు శ్రీ జవ్వాజి రామాంజనేయులు పాల్గోన్నారు.
ప్రముఖ నటి ఖుష్బు గారు మాట్లాడుతూ" కళావతి తెలుగు లో అతిపెద్ద విజయం సాదించాలని చిత్రం యూనిట్ మెత్తానికి తన బెస్ట్ విషెస్ తెలిపారు. హర్రర్ కామెడి చిత్రాల్లో ఈచిత్రం రికార్డు చిత్రం గా నిలవాని తను కొరుకున్నారు.." అని అన్నారు
ఈసందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ". సుందర్ సి దర్శకత్వంలో వస్తున్న కళావతి చిత్రం యెక్క మెదటి లుక్ ని ఈరోజు ప్రముఖ నటి ఖుష్బు చేతుల మీదుగా విడుదల చేశారు. ఈచిత్రం కామెడీ చిత్రాల్లోనే బాక్సాఫీస్ ను షేక్ చేసిన చిత్రంగా తెలుగు రికార్డులు తిరగరాస్తుందని ఆమె అన్నారు. .మా సంస్థలైన గుడ్ సినిమా గ్రూప్, సర్వంత్రమ్ క్రేయేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ చిత్రాన్ని సైతం భారీ పబ్లిసిటీతో ప్రేక్షకుల ముందుకు త్వరలోనే తీసుకురాబోతున్నాం. సుందర్ సి, సిద్ధార్థ, త్రిష, హన్సిక మోత్వాని, పూనమ్ బాజ్వా పెర్ ఫార్మెన్స్ అద్భుతంగా ఉంటుంది. అద్భుతమైన గ్రాఫిక్స్ తో మెస్మరైజ్ అవుతారు.ఈ చిత్రం మెదటి భాగం కంటే మా కళావతి లో రెండింతలు ఎంటర్ టైన్ మెంట్ ను దర్శకుడు అందించబోతున్నారు. చిత్రం మెదటి లుక్ ని విడుదల చేశాము. త్వరలో ట్రైలర్ ని విడుదలచేసి హిప్ హాప్ మ్యూజిక్ ని జనవరి మూడవ వారంలో విడుదల చేస్తాము, రీ రికార్డింగ్ ఈ చిత్రానికి మరో ప్రధాన బలం. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి జనవరి నెలాఖరున చిత్రాన్ని విడుదల చేస్తాము." అని అన్నారు.
సమర్పణ - శ్రీ జవ్వాజి రామాంజనేయులు , నటీనటులు - సుందర్ సి, సిద్ధార్థ, త్రిష, హన్సిక, పూనమ్ బాజ్వా, సూరి, కోవై సరళ, రాధా రవి, సంగీతం - హిప్ హాప్ తమిఝా, దర్శకుడు - సుందర్ సి, నిర్మాత - గుడ్ ఫ్రెండ్స్
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments