ఇండియన్ పనోరమ కోసం ఎపిక్ సాగా 'ఖుదీరామ్ బోస్' ఎంపిక
Send us your feedback to audioarticles@vaarta.com
భారత స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొన్న అతి పిన్న వయస్కుడైన మొదటి స్వాతంత్ర్య సమర యోధుడు ఖుదీరామ్ బోస్,తను 1889లో జన్మించాడు. అయితే ప్రసిద్ధ ముజఫర్‌పూర్ కుట్ర కేసులో బ్రిటీష్ రాజ్ చేత దోషిగా నిర్ధారించబడి 1908లో మరణశిక్ష విధించబడ్డాడు.ఈ కేసు విషయంలో జరిగిన కుట్ర విషయం.చరిత్రను అనుసరించే విద్యార్థులకు బాగా తెలుసు. ఖుదీరామ్ బోస్‌పై తీస్తున్న పాన్-ఇండియా బయోపిక్ అత్యంత ఆశాజానకమైన చిత్రాలలో ఒకటి. ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (ఐఎఫ్‌ఎఫ్‌ఐ) 53వ ఎడిషన్‌లో ప్రదర్శించడానికి తెలుగు చిత్రం 'ఖుదీరామ్ బోస్' ఎంపికైనట్లు నూతన నిర్మాత రజిత విజయ్ జాగర్లమూడి మరియు దర్శకులు విజయ్ జాగర్లమూడి మరియు డివిఎస్ రాజు సంతోషంగా ప్రకటించారు. ఈ చిత్రం ఆసియాలో జరిగే అతిపెద్ద ఫిలం ఫెస్టివల్స్ లో ఒకటిగా ఇండియా ఇంటర్ నేషనల్ ఫిలిం ఫెస్టివల్.ఇండియన్ పనోరమా, ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (IFFI) ఈరోజు 25 ఫీచర్ ఫిల్మ్‌లు మరియు 20 నాన్ ఫీచర్ ఫిల్మ్‌ల ఎంపికను ప్రకటించింది.ఇందులోని ఫీచర్స్ ఫిలిమ్స్ విభాగంలో కుదిరం బోస్ ఎంపిక చేయబడింది.ఎంపిక చేసిన చిత్రాలు 2022 నవంబర్ 20 నుండి 28 వరకు గోవాలో జరిగే 53వ IFFIలో ప్రదర్శించబడతాయి.
జాగర్లమూడి పార్వతి సమర్పణలో గోల్డెన్ రెయిన్ ప్రొడక్షన్స్ పతాకంపై రాకేష్ జాగర్లమూడి, వివేక్ ఒబెరాయ్, అతుల్ కులకర్ణి, నాజర్, రవిబాబు, కాశీ విశ్వనాథ్ నటీ నటులుగా ప్రతిభావంతులైన విజయ్ జాగర్ల మూడి, డి. వి. యస్. రాజుల దర్శకత్వంలో రజిత విజయ్ జాగర్లమూడి నిర్మిస్తున్న స్వాతంత్ర్య సమర యోధుడు బయోపిక్ చిత్రం “ఖుదీరామ్ బోస్”. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, బెంగాలీ, హిందీ భాషల్లో పాన్ ఇండియా సినిమాగా రూపొందుతున్న ఈ సినిమా శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకొంది.ఇందులో రాకేష్ జాగర్లమూడి తొలిసారిగా నటుడిగా పరిచయం అవుతున్న ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌లో అత్యుత్తమ నటను కనబరచారు. సంగీత దర్శకుడు మణిశర్మ, అవార్డు గెలుచుకున్న ప్రొడక్షన్ డిజైనర్ పద్మశ్రీ తోట తరణి, స్టంట్ డైరెక్టర్ కనల్ కన్నన్ మరియు సినిమాటోగ్రాఫర్ రసూల్ ఎల్లోర్, ఎడిటర్ మార్తాండ్ కె వెంకటేష్ మరియు డైలాగ్ రైటర్ బాలాదిత్య ఇలా ఈ చిత్రానికి పని చేశారు
నటీనటులు : రాకేష్ జాగర్లమూడి, వివేక్ ఒబెరాయ్, అతుల్ కులకర్ణి, నాజర్, రవిబాబు, కాశీ విశ్వనాథ్ తదితరులు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments