ఆద్యంతం ఉత్కంఠగా ‘ఖిలాడి’ టీజర్
Send us your feedback to audioarticles@vaarta.com
‘క్రాక్’ సినిమా మంచి సక్సెస్ సాధించిన అనంతరం ఫుల్ జోష్‌తో మాస్ మహరాజన్ రవితేజ చేస్తున్న చిత్రం ‘ఖిలాడి’. రమేష్ వర్మ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో రవితేజ సరసన డింపుల్ హయాతి, మీనాక్షి చౌదరి కథానాయికలుగా నటిసన్తున్నారు. సత్యనారాయణ కోనేరు, రమేష్ వర్మ పెన్మెస్తా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను చిత్ర యూనిట్ ఉగాది కానుకగా విడుదల చేసింది. సింగిల్ డైలాగ్‌తో లేపేసిన ఈ టీజర్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.
‘ఇఫ్ యు ప్లే స్మార్ట్ విత్ అవుట్ స్టుపిడ్ ఎమోషన్స్ యు ఆర్ అన్‌స్టాపబుల్’ అని టీజర్‌లో రవితేజ్ సింగిల్ డైలాగ్ మాత్రమే ఉంటుంది. మిగతాదంతా మ్యూజిక్‌తో కానిచ్చేశారు. టీజర్ ఆద్యంతం ఉత్కంఠగా సాగింది. ఈ టీజర్‌కు రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ప్రాణమని చెప్పాలి. ఈ టీజర్‌లో రవితేజ సరికొత్తగా కనిపించారు. స్టైల్ అభిమానులను ఆకట్టుకుంటుందనడంలో సందేహం లేదు. మొత్తంమీద టీజర్ అయితే సినిమాపై అంచనాలను పెంచేదిగానే ఉంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments