ఆద్యంతం ఉత్కంఠగా ‘ఖిలాడి’ టీజర్

  • IndiaGlitz, [Monday,April 12 2021]

‘క్రాక్’ సినిమా మంచి సక్సెస్ సాధించిన అనంతరం ఫుల్ జోష్‌తో మాస్ మహరాజన్ రవితేజ చేస్తున్న చిత్రం ‘ఖిలాడి’. రమేష్ వర్మ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో రవితేజ సరసన డింపుల్ హయాతి, మీనాక్షి చౌదరి కథానాయికలుగా నటిసన్తున్నారు. సత్యనారాయణ కోనేరు, రమేష్ వర్మ పెన్మెస్తా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను చిత్ర యూనిట్ ఉగాది కానుకగా విడుదల చేసింది. సింగిల్ డైలాగ్‌తో లేపేసిన ఈ టీజర్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

‘ఇఫ్‌ యు ప్లే స్మార్ట్‌ విత్‌ అవుట్‌ స్టుపిడ్‌ ఎమోషన్స్‌ యు ఆర్‌ అన్‌స్టాపబుల్‌’ అని టీజర్‌లో రవితేజ్ సింగిల్ డైలాగ్ మాత్రమే ఉంటుంది. మిగతాదంతా మ్యూజిక్‌తో కానిచ్చేశారు. టీజర్ ఆద్యంతం ఉత్కంఠగా సాగింది. ఈ టీజర్‌కు రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ప్రాణమని చెప్పాలి. ఈ టీజర్‌లో రవితేజ సరికొత్తగా కనిపించారు. స్టైల్‌ అభిమానులను ఆకట్టుకుంటుందనడంలో సందేహం లేదు. మొత్తంమీద టీజర్ అయితే సినిమాపై అంచనాలను పెంచేదిగానే ఉంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది.

More News

తిరుపతి ఉపఎన్నిక వేళ జనసేన పార్టీకి షాక్..

తిరుపతి ఉప ఎన్నిక వేళ జనసేన పార్టీకి షాక్ తగిలింది. ఒకవైపు ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ హోం క్వారంటైన్‌లో ఉండటంతో ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొనలేకపోతున్నారు.

విజృంభిస్తున్న కరోనా.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

కోవిడ్‌ సెకండ్ వేవ్ తెలంగాణలో విజృంభిస్తోంది. మూడు వేలకు పైగా కేసులు నమోదవుతూ ఆందోళన కలిగిస్తోంది.

ప్రైమ్‌లో ‘వకీల్ సాబ్’.. ముహూర్తం ఫిక్స్!

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన ‘వకీల్ సాబ్’ మూవీ గత శుక్రవారం విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ టాక్‌తో దూసుకెళుతోంది.

‘జాతిరత్నాలు’ నిర్మాతకు ఎంత లాభం తెచ్చిపెట్టిందంటే..

లాక్‌డౌన్ తర్వాత మరీ ముఖ్యంగా చెప్పాలంటే మార్చి నెలలో ప్రేక్షకులను ఓ రేంజ్‌లో అలరించిన చిత్రం ‘జాతిరత్నాలు’.

వైసీపీ ఓడితే ఎంపీలంతా రాజీనామా చేస్తారు: పెద్దిరెడ్డి

టీడీపీ అధినేత చంద్రబాబు విసిరిన రెఫరెండం సవాల్‌ను మంత్రి పెద్దిరెడ్డి స్వీకరించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..